kumaram bheem asifabad- ఐటీడీఏ ముట్టడికి ఆదివాసీలు తరలిరావాలి
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:17 PM
సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చేపట్టే చలో ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడికి ఆదివాసీలు తరలిరావాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గేడాం గోపిచంద్ కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, దీని కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జైనూర్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చేపట్టే చలో ఉట్నూర్ ఐటీడీఏ ముట్టడికి ఆదివాసీలు తరలిరావాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గేడాం గోపిచంద్ కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, దీని కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70, పెసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. 109 జీవో ప్రకారం ఏజెన్సీలో 75 శాతం ఉద్యోగాలను గిరిజనులచే భర్తీ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 120 రాయి సెంటర్లకు భవనాలు నిర్మిస్తామన్న మాటలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3ని యధావిధిగా కొనసాగించాలని చెప్పారు. ఐటీడీఏ పరిధిలో ఖాళీగాఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో 49ను శాశ్వతంగా రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై దాడులను అరికట్టాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని మవాల మండలం, కుంరంభీం జిల్లాలో నివసిస్తున్న ఆదివాసీలకు ఇంటి స్థలాలు, విద్య, వైద్యం, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని గేడాం గోపిచంద్ డిమాండ్ చేశారు. సమావేశంలో ఆదివాసీ నాయకులు సిడాం ధర్ము, పెందుర్ గోవింద్‌రావ్, మడావి మనోజ్, గేడాం విజయ్, మడావి అమృత్, మేస్రాం మనోహర్, మేస్రాం మారుతి తదితరులు పాల్గొన్నారు.