1.7లక్షలకు పసికందు విక్రయం
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:30 AM
డబ్బు కోసం పేగుబంధాన్ని మరిచి.. కన్నబిడ్డనే విక్రయించిన ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది....
మెదక్‌లో దారుణం
హవేళిఘణపూర్, మార్చి10 (ఆంధ్రజ్యోతి): డబ్బు కోసం పేగుబంధాన్ని మరిచి.. కన్నబిడ్డనే విక్రయించిన ఘటన మెదక్ జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఐజీడీఎస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేళిఘణపూర్‌లోని లింగ్సాన్‌పల్లి తండాకు చెందిన ఓ గిరిజన మహిళ గత నెల 10న మెదక్ ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. వారం తర్వాత ఆ శిశువును కామారెడ్డి చెంది న దంపతులకు 1.7లక్షలకు అమ్మేసినట్లు సమాచారం. అయితే, అంగన్వాడీ కేంద్రం నుంచి ఇచ్చే పౌష్టికాహారం తీసుకోవడానికి ఆ మహిళ రాకపోవడంతో అనుమానించిన టీచర్.. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు తండాకు వెళ్లి విచారించగా అసలు విషయం బయటపడింది. శిశువును విక్రయించిన సదరు దంపతులుచేగుంటలో ఉంటున్నట్లు తెలుసుకున్న అధికారులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తల్లిదండ్రులతోపాటు కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.