Share News

రాష్ట్రపతితో పీహెచ్‌డీ పట్టభద్రుల సమావేశం

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:23 AM

పీహెచ్‌డీ పూర్తి చేసిన సుమారు 200 మంది గిరిజన పట్టభద్రులు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. వీరిలో వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌....

రాష్ట్రపతితో పీహెచ్‌డీ పట్టభద్రుల సమావేశం

  • హాజరైన కొడంగల్‌ గురుకుల టీచర్‌ విఠల్‌ రాథోడ్‌

కొడంగల్‌ రూరల్‌, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): పీహెచ్‌డీ పూర్తి చేసిన సుమారు 200 మంది గిరిజన పట్టభద్రులు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. వీరిలో వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ ఎంజేపీ బీసీ గురుకుల టీచర్‌ విఠల్‌ రాథోడ్‌ కూడా ఉన్నారు. బషీరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన నాగీబాయి-రామునాయక్‌ల కుమారుడైన విఠల్‌ రాథోడ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి 2014లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. జన జాతీయ గరిమా ఉత్సవ్‌ వేడుకల్లో భాగంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గిరిజన స్కాలర్‌షిప్‌ పథకాల లబ్ధిదారులతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిర్సా లైవ్స్‌ ఇన్‌ న్యూ భారత్‌ వీక్‌ సందర్భంగా జరిగిన ఈ సమావేశంలో గిరిజన నాయకుడు భగవాన్‌ బిర్సా ముండాను స్మరించుకున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 06:23 AM