గాంధీభవన్‌లో రేపు ఆదివాసీ కాంగ్రెస్ కీలక భేటీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:14 AM
రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరగనుంది. రాష్ట్ర ఆదివాసీ...
చేవెళ్ల డిక్లరేషన్ అమలు.. అపరిష్కృత అంశాలపై చర్చ
హైదరాబాద్, మార్చి9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరగనుంది. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ఛైర్మన్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసీల సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని ఒక్కో మండలానికి ఐదుగురు చొప్పున కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తలు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ ప్రకటించిన చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై ప్రధానంగా చర్చించి సమగ్ర నివేదికను పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ లింగం నాయక్, కూరాకుల మల్లికార్జున్ ఓ ప్రకటనలో కోరారు.