సీఎం రేవంత్‌ను కలిసిన ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 07:04 AM
మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై..
పలు సమస్యలపై వినతి పత్రాల అందజేత..
హైదరాబాద్, జూలై 2(ఆంధ్రజ్యోతి): మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంకు వినతి పత్రాలు అందించారు. ఏజెన్సీ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, పోడు భూములకు పట్టాలతో పాటు ఇందిర గిరి జల వికాసం పథకం అమలు చేయాలని కోరారు. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని, ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని విన్నవించారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, వెడ్మ బొజ్జు ఉన్నారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ పాల్గొన్నారు.