Share News

పీఎం రహత్‌ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స

ABN , Publish Date - Oct 24 , 2026 | 10:14 PM

పీఎం రహత్‌ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బా ధితులకు రూ. 1.50 లక్షల ఉచిత చికిత్స అందిస్తామ ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కా న్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, పోలీసులతో సమావేశం నిర్వహించారు.

పీఎం రహత్‌ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : పీఎం రహత్‌ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బా ధితులకు రూ. 1.50 లక్షల ఉచిత చికిత్స అందిస్తామ ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కా న్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ర హదారి ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సహాయం అందించి ప్రాణాలను కాపాడమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చే స్తుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టం గా 7 రోజుల వ్యవధికి సంబంధించి చికిత్స సదుపా యం ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాద వివరాలను ని ర్ధారించేందుకు పోలీసులకు 24 గంటల గడువు ఉం టుందన్నారు. పథకం అమలులో జాతీయ ఆరోగ్య ప్రా ధికార సంస్థ, రోడ్డు రవాణా రహదా రుల మంత్రిత్వ శాఖ, ఆసుపత్రులు, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ తదితర వ్యవస్థలు సమన్వయంతో పని చేస్తా యన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనం తరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధి కారులతో మాట్లాడుతూ పీఎం ర హత్‌ పథకం అమలు విధానంపై డే టా ఎంట్రీ ఆపరేటర్లకు సమగ్ర శిక్షన అందించాలని ఆదేశించారు. జిల్లాలో పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా నిర్ధేశించిన విధానాలను ఖచ్చి తంగా పాటిస్తూ పథకాన్ని సమర్ధవం తంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీ సీపీ భాస్కర్‌, డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌, ఆరో గ్యశ్రీ మేనేజర్‌ సత్యనారాయణ, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఈడీఏఆర్‌ జిల్లా మేనేజర్‌శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 10:14 PM