Share News

kumaram bheem asifabad- ‘చెత్త’గా సేకరణ

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:15 PM

పట్టణాలు, గ్రామాల్లో చెత్త సేకరణకు మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చినప్పటికీ అధికారులు అవగాహన కల్పించక పోవడంతో లక్ష్యం నీరుగారిపోతున్నది. కొత్త విధానంలో ప్రజలు ఇంటి వద్దనే తడి, పొడ్డి చెత్త వేరే చేసి నాలుగు రకాలగా విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. తడి చెత్తతో కంపోస్టు ఎరువు, పొడి చెత్తతో పునర్వినియోగ వస్తువులను తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఈ విధానం పట్టణాలు, పంచాయతీల్లో నాలుగు రకాల డబ్బాల ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడ కూడా ఇంత వరకు కనిపించడం లేదు.

kumaram bheem asifabad- ‘చెత్త’గా సేకరణ
లోగో

కాగజ్‌నగర్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పట్టణాలు, గ్రామాల్లో చెత్త సేకరణకు మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తెచ్చినప్పటికీ అధికారులు అవగాహన కల్పించక పోవడంతో లక్ష్యం నీరుగారిపోతున్నది. కొత్త విధానంలో ప్రజలు ఇంటి వద్దనే తడి, పొడ్డి చెత్త వేరే చేసి నాలుగు రకాలగా విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. తడి చెత్తతో కంపోస్టు ఎరువు, పొడి చెత్తతో పునర్వినియోగ వస్తువులను తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఈ విధానం పట్టణాలు, పంచాయతీల్లో నాలుగు రకాల డబ్బాల ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడ కూడా ఇంత వరకు కనిపించడం లేదు. జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నిత్యం కాగజ్‌నగర్‌లో 27, ఆసిఫాబాద్‌లో 12 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. కొత్త విధానాన్ని అమలు చేయడంతో జాప్యం జరుగుతుండగా పాత పద్ధతి సైతం అమలుకు నోచుకోవడం లేదు. పాత విధానంలో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు మున్సిపాలిటీ, పంచాయతీల్లో గతంలో నీలం, ఆకుపచ్చ రంగు చెత్త బుట్టలు అందజేశారు. ప్రస్తుతం అవి కూడా పాడయ్యాయి. ప్రజలు తమ నివాసాల్లోనే సొంతంగానే డబ్బాలు ఏర్పాటు చేసుకొని తడి, పొడిని కలిపి చెత్తను సేకరణ వాహనాలకు ఇస్తున్నారు. కొత్త విధానంలో నీలం, ఆకుపచ్చ చెత్త బుట్ట లతో పాటు ఎరుపు, నలుపువి ఏర్పాటు చేసుకునేలా డబ్బాలను పంపిణీ చేయాల్సి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు.

కొత్త నిబంధనలు ఇలా..

ఆకుపచ్చ రంగు డబ్బాలో కూరగాయాలు, తొక్కలు ఆహార అవశేషాలు, పండ్ల వ్యర్థాలు వంటి జీవ వ్యర్థాలను ఇందులో వేయాల్సి ఉంటుంది. వీటితో సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు రూపొందించారు. అలాగే నీలం రంగు డబ్బాలో కాగితాలు, ప్లాస్టిక్‌, లోహపు వ్యర్థాలు వంటి పొడి చెత్తను ఇందులో వేయాల్సి ఉంటుంది. వీటిని వేరు చేసి రీ సైక్లింగ్‌కు పంపించనున్నారు. ఎరుపు రంగు డబ్బా పారిశుధ్య సంబంఽఽధిత వ్యర్థాలు ఉపయోగించిన శానిటరీ ప్యాడ్లు, డైపర్లు వంటి వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. నలుపు డబ్బాలో గృహంలో వాడేసిన బ్యాటరీలు, గడువు ముగిసిన మందులు, రసాయన అవశేషాల, ఇతర ప్రమాదకర గృహ వ్యర్థాలను ఈ డబ్బాలో వేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో రోడ్లు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుక పోవడాన్ని పూర్తిగా తగ్గించే అవకాశాలున్నాయి. ఆరోగ్య పరిరక్షణలో కూడా ఎంతో కీలకం కానుంది. బహిరంగంగా చెత్త వేయడం వల్ల పెరిగే ఈగలు, దోమలు, దుర్వాసన సమస్యలు పూర్తి స్థాయిలో నివారించే అవకాశాలున్నాయి. అలాగే చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా బహిరంగా పడేయటం, కాల్చడం సమస్యలు ఇక ఉండవు. డబ్బాలను పంచాయతీ, మున్సిపల్‌ నిధులతో కొనుగోలు చేయాల్సి రావడంతో ముందుకు రావడం లేదని సమాచారం. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతిని వివరణ కోరగా తడి, పొడి చెత్త విషయంలో అవగామన కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలోనే కొత్త విధానం అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు..

Updated Date - Oct 25 , 2026 | 10:15 PM