Share News

ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:29 AM

ప్రభుత్వ శాఖల పనితీరు క్షేత్రస్థాయిలో మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందే లా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి

ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి
బొంపల్లి పాఠశాలలో రాగిజావను పరిశీలిస్తున్న కలెక్టర్‌

పెద్దపల్లి రూరల్‌ , జూలై 23 (ఆఽంధ్రజ్యోతి) : ప్రభుత్వ శాఖల పనితీరు క్షేత్రస్థాయిలో మెరుగుపడి ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందే లా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి మండలంలోని బొంపల్లి, బ్రాహ్మణపల్లి, రాగినేడు గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ విస్తృతంగా పర్యటించారు. బ్రాహ్మణపల్లి ఎం.పీ.పీ.ఎస్‌, జిల్లా పరిషత్‌ పాఠఽఽశాల , అంగన్‌వాడీ కేంద్రం, రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాగినేడు జిల్లా పరిషత్‌ పాఠశాల, బొంపల్లి పాఠశాల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే రాగిజావ నాణ్య తను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, వంటి ప్రాథమిక నైపుణ్యాలు పూర్తిస్థాయిలో సాధిం చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఉపాధ్యా యులను ఆదేశించారు. బ్రాహ్మణపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల ఎదుగుదల, పోషకాహార పంపి ణీని పరిశీలించి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు తదితర ఆహారాన్ని సకాలంలో అందిం చాలని సూచించారు. రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పనితీరు మెరుగు పరచాలన్నారు.

ఫ విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

పెద్దపల్లి రూరల్‌ : ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకాలు కల్పిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గంట రమేష్‌ ప్రభుత్వ అధికా రిని విధుల నిర్వహణలో అడ్డుకోవడం, అసభ్యకర, అనుచిత పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడినట్లు సహాయ కార్యనిర్వహణ ఇంజనీర్‌ అందజేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం, 2018లోని సెక్షన్‌ 37 ప్రకారం షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఫ అభ్యసన సామర్థ్యాలు పెంచాలి

పెద్దపల్లి కల్చరల్‌ : విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యా లను పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయా లని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగిం చుకొని నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ప్రధానో పాధ్యాయుల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిం చాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌ ప్రాథమిక పాఠశాల, సాంఘిక సంక్షేమ వసతి గృహా లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాం టి అసౌకర్యాలు లేకుండా వసతి గృహాల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఫ తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

జూలపల్లి : మండల తహశీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ కోయాశ్రీహర్ష తనిఖీ చేశారు. పెండింగ్‌లో భూ భూ సమస్యలతో పాటు ఇతర దరఖాస్తులను వెంటనే పరిస్కరించేలా కృషిచేయాలని తహశీల్దార్‌ దత్తు ప్రసాద్‌రావుకు సూచించారు. మండల ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Updated Date - Jul 24 , 2026 | 12:29 AM