kumaram bheem asifabad- యాప్‌తో పారదర్శకంగా ఇసుక సరఫరా
ABN , Publish Date - Apr 04 , 2026 | 10:56 PM
అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర ్శకంగా ఇసుక సరఫరా చేసేలా మన ఇసుక వాహనం యాప్‌ను తీసుకొచ్చా మని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారిచే మన ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ వెబ్ పోర్టల్‌పై తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు, ఆపరేటర్లకు శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, భూగర్భ గనుల శాఖ సంచాలకులు గంగాధర్‌రావులో కలిసి కలెక్టర్ హరిత హాజరయ్యారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర ్శకంగా ఇసుక సరఫరా చేసేలా మన ఇసుక వాహనం యాప్‌ను తీసుకొచ్చా మని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరేట్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారిచే మన ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ వెబ్ పోర్టల్‌పై తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు, ఆపరేటర్లకు శనివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, భూగర్భ గనుల శాఖ సంచాలకులు గంగాధర్‌రావులో కలిసి కలెక్టర్ హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగా తహసీల్దార్, పంచా యతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు మన ఇసుక వాహనం పోర్టల్‌లో పొందుపరిచిన విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇసుక రవాణాను ఆన్‌లైన్ ద్వారా పూర్తి పారదర్శకతతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణాపై లబ్ధిదారులకు మన ఇసుక వాహనం పోర్టల్‌పై వివరించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అని చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేసి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలలో వేసవి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేతి పంపులు, బోర్‌వెల్స్, పైపు లైన్‌లను మరమ్మతులు చేపట్టి తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గ్రామ పంచయాతీలలో పారిశుధ్యం ప్రతి రోజు చేపట్టాలని వీధి లైట్లు పగటి పూట వెలుగుతున్నాయని వాటికి నియంత్రికలు అమర్చాలన్నారు. ఏప్రిల్ నెలలో నిర్వహిస్తున్న జనగణనలో భాగంగా ఏన్యూమరేటర్ల ఇళ్ల జాబితాను రూపొందిస్తున్నారని వారికి పంచాయతీ కార్యదర్శులు సహకరించాలన్నారు. భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా తహసీల్దార్‌లు దృష్టి సారించాలన్నారు. పీడీఎస్ బియ్యం మూడు నెలలవి ఒకే సారి పంపిణీ చేస్తున్నందున రద్దీ లేకుండా చూడాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలనాధికారులు, తదితరులు పాల్గొన్నారు.