వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ
ABN , Publish Date - Oct 23 , 2026 | 11:49 PM
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారద ర్శకంగా నిర్వహిస్తూ అభ్యుర్ధుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆ ధారంగా ఎంపిక చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
హాజీపూర్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారద ర్శకంగా నిర్వహిస్తూ అభ్యుర్ధుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆ ధారంగా ఎంపిక చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. శుక్రవారం హాజీపూర్ మండలంలోని ప్రభుత్వ వైద్య కళాశాల లో దంత వైద్య విభాగంలో అధ్యాపకుల కోసం నిర్వహించిన నియామక ప్రక్రియకు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుం డా నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపడుతున్నామన్నా రు. అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష, పీజీ మార్కులు, ఇంటర్య్వూలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని ప్రతిభ, అనుభవం తదితర అంశాలను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఇంటర్య్వూ లో అభ్యర్ధులు సాధించిన మార్కులతో పాటు పీజీ మార్కుల కు నిర్ధేశించిన వెయిటేజీని పరిగణలోకి తీసుకుని తుది మెరి ట్‌ను నిర్ణయించామన్నారు. ఈ ప్రక్రియలో అభిషేక్ అత్యుత్త మ ప్రతిభ కనబర్చగా ఎంపిక చేసేందుకు కమిటీ నిర్ణయిం చామన్నారు. ఎంపికైన అభ్యర్ధి త్వరలో విధుల్లో చేరేలా ని యామక ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, అవ సరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృ ష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలాశాల మైదానం అభివృద్ధి, క్రీడా వసతుల కల్పన, తాగునీటి సదుపాయం, ఇంటర్నెట్ సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ క మిషనర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవాజీ ,ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అశోక్ పాల్గొన్నారు.