Share News

kumaram bheem asifabad-వీబీజీరామ్‌జీ పనుల్లో పారదర్శకత పాటించాలి

ABN , Publish Date - Nov 06 , 2026 | 10:26 PM

వీబీజీ రామ్‌జీ పనుల్లో పారదర్శకత పాటించాలని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం వీబీజీరామ్‌జీ పనులపై నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి అక్రమాలకు పాల్పడిన వారిని ఊరుకునేది లేదన్నారు. అర్హులైన వారికి పని కల్పించాలన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఇందుకు జలసంరక్షణ కార్యక్రమం చేపట్టాలన్నారు. అ

kumaram bheem asifabad-వీబీజీరామ్‌జీ పనుల్లో పారదర్శకత పాటించాలి
ప్రజావేదికలో సమస్యలపై ప్రశ్నిస్తున్న డీఆర్‌డీవో దత్తారావు

కెరమెరి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ పనుల్లో పారదర్శకత పాటించాలని డీఆర్‌డీవో దత్తారావు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం వీబీజీరామ్‌జీ పనులపై నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించి అక్రమాలకు పాల్పడిన వారిని ఊరుకునేది లేదన్నారు. అర్హులైన వారికి పని కల్పించాలన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఇందుకు జలసంరక్షణ కార్యక్రమం చేపట్టాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా వీబీజీరామ్‌జీ పనుల్లో రూ.4లక్షల మేర అక్రమాలు జరిగినట్టు ప్రజావేదికలో అధికారులు తేల్చారు. ప్రజావేదికలో పలువురు అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు వివరించారు. మండల వ్యాప్తంగా 1-04-2025 నుంచి 31-03-2026 వరకు జరిగిన 523 పనులకు రూ.7,43,99,836లతో పనులు చేసినట్టు వివరించారు. ఇందులో రూ.4లక్షలు అక్రమాలకు పాల్పడినట్టు ప్రకటించారు. ఈ మేరకు బాధ్యులైన ముగ్గురు టీఏలు, ఇద్దరు కార్యదర్శులకు షోకాజు నోటీసులు అందజేశారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పేరిట అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రజా వేదికలో విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. మరి కొన్ని చోట్ల రెండ్రోజుల పనికి వెళ్లినప్పటికీ పక్షం రోజుల డబ్బులు చేసినట్టు సదరు అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల చని పోయిన వారిపై డబ్బులు చెల్లించినట్టు గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిరాం గౌడ్‌, విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 10:26 PM