Share News

ట్రాన్స్‌ఫర్‌.. టెన్షన్‌

ABN , Publish Date - Jan 02 , 2026 | 10:51 PM

విద్యుత్‌ ఉద్యోగుల్లో ట్రాన్స్‌ఫర్‌ టెన్షన్‌ నెలకొంది. విద్యుత్‌ సం స్థల్లో సాధారణ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ఇం ధనశాఖ ఉత్తర్వులు జారీ చేయడంపట్ల ఆశాఖ ఉ ద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నా యి.

ట్రాన్స్‌ఫర్‌.. టెన్షన్‌

బదిలీలపై విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

హఠాత్తుగా ఇతర ప్రాంతాలకు బదిలీపై అనాసక్తి

పిల్లల చదువు మధ్యలో వెళ్లడంతో ఇబ్బందులు

ప్రభుత్వ నిర్ణయంపై యూనియన్ల పెదవి విరుపు

మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్‌

ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఆరువేల మంది పై చిలుకు ఉద్యోగులు

======================

మంచిర్యాల, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యోగుల్లో ట్రాన్స్‌ఫర్‌ టెన్షన్‌ నెలకొంది. విద్యుత్‌ సం స్థల్లో సాధారణ బదిలీలకు అనుమతిస్తూ రాష్ట్ర ఇం ధనశాఖ ఉత్తర్వులు జారీ చేయడంపట్ల ఆశాఖ ఉ ద్యోగుల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నా యి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలు వెంటనే చేపట్టి ఈ నెల 31లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని డిస్కమ్‌ (టీజీఎన్‌ పీడీసీఎల్‌, టీజీఎస్‌పీడీసీఎల్‌)ల చైర్మన్‌లను ఆదేశి స్తూ ప్రభుత్వం డిసెంబరు 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా ప్ర భుత్వ ఉద్యోగుల అంతర్‌ జిల్లా బదిలీలు వేసవి సెల వుల్లో చేపడతారు. వేసవి సెలవుల్లో బదిలీ చేస్తే పా ఠశాలలకు విద్యా సంవత్సరం ముగుస్తున్నందున ఉ ద్యోగులు కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అందుకు భిన్నంగా జనవరి నెలాఖరు వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆదేశాలు వెలువడటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపడితే పిల్లల చదు వులకు ఆటంకాలు ఏర్పడటంతోపాటు కుటుంబ స మస్యలు తలెత్తుతాయని పలువురు ఉద్యోగులు ఆం దోళన చెందుతుండగా, మూడు నెలల పాటు బదిలీ ప్రక్రియను వాయిదా వేయాలని యూనియన్లు డి మాండ్‌ చేస్తున్నాయి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగు లకు, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసేవారికి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో బదిలీలు చేపడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో అతికొద్ది సంఖ్యలో ఉద్యోగులను వేసవి సెలవులకు కొద్దిగా అటూ ఇటుగా కూడా ట్రాన్స్‌ఫర్లు చేస్తుంటారు. అయితే మూకుమ్మడిగా బదిలీలు చేప ట్టందుకు ఉత్తర్వులు వెలువడంతో విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నా రు. విద్యుత్‌ సంస్థల్లో బదిలీలు చేపట్టాలని ఆదేశిస్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకు టీజీ ఎస్‌పీడీసీఎల్‌, ఎన్‌పీడీసీఎల్‌, జెన్‌కోల లో అందుకు సంబంధించిన మార్గదర్శకాలకు కసర త్తు కూడా ప్రారంభమైంది. టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధి లోని 5వ జోన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామా బాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో దాదాపు ఆరు వేలపై చిలుకు మంది ఉద్యోగులు విధులు ని ర్వహిస్తున్నారు. హఠాత్తు బదిలీలతో వారిలో అనేక మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నా యనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు సంవత్సరాలకే బదిలీ...!

ఉద్యోగుల బదిలీలకు సంబంఽధించిన ఉత్తర్వులు జారీ కావడంతో ఈసారి రెండేళ్లకు ఒకే చోట పని చేసిన వారికి స్థాన చలనం తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మూడేళ్లు ఒకే చోట పని చేసిన వారిని బదిలీలకు అర్హులుగా గుర్తించే వారు. రెండు సంవత్సరాలు పూర్తయిన వారికి విజ్ఞప్తులను బట్టి అవకాశం కల్పించేవారు. ఇప్పుడు కొత్తగా రెండు సంవత్సరాలు కటాఫ్‌ విధించడంపైనా ఉద్యోగులతో పాటు తెలంగాణ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయిస్‌ (టీఈఈ) 1104 యూనియన్‌, తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) నాయకులు తీవ్ర అసంతృ ప్తిని వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో పిల్లలకు పరీక్షలు ఉంటాయని, అవి పూర్తికాగానే బదిలీలు చే పడితే బాగుంటదనే డిమాండ్‌లు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి. అలా కాకుండా విద్యా సంవత్సరం మ ధ్యలో బదిలీలు చేపడితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆగమేఘాల మీద బదిలీలు చేపట్టడం ఎందకనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గతంలో మాదిరిగా మూడేళ్లు ఒకే చోట పని చేసిన వారిని బదిలీలకు అర్హులుగా గుర్తించాలనే డిమాండ్‌లు సైతం తెరమీదికి వస్తున్నాయి. బదిలీలకు తాము వ్యతిరేకం కాదని, వేసవి సెలవులు వచ్చేంత వరకు మరో మూడు నెలలపాటు వేచి ఉండాలని, ఈ విష యమై ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాల్సిన అవస రం ఉందనే అభిప్రాయాలను మెజారిటీ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం సమంజసంకాదు...

తెలంగాణ ఎలక్ర్టిసిటీ 1104 యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి

హఠాత్తుగా విద్యుత్‌ ఉద్యోగుల బదిలీల కోసం ఉత్తర్వులు జారీ చేయడంలో ప్రభుత్వ నిర్ణయం స మంజసం కాదు. చాలా మంది ఉద్యోగుల పిల్లలు మార్చిలో పరీక్షలకు హాజరవుతారు. ఆలోగా ఇతర ప్రాంతాకు పంపడమంటే ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడమే అవుతుంది. అలాగే ఉన్న ఫలంగా మరోచోటికి వెళ్లడంలో కుటుంబ సమస్యలూ తలెత్తు తాయి. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.

కంపెనీ నిర్ణయం తప్పు......

ముష్కె నర్సయ్య, టీఆర్‌వీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు

విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేపట్టాలనే నిర్ణయం కంపెనీ తప్పిదం. ఈ నిర్ణయం వల్ల పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుంది. ఉద్యోగుల కు టుంబాలు ఆందోళన చెందుతాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యవసర బదిలీలు చేప ట్టడంలో ఆంతర్యమేమిటో అంతు చిక్కకుండా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేపట్టి, వేసవి సెలవుల్లో బదిలీలు చేపట్టాలి.

Updated Date - Jan 02 , 2026 | 10:51 PM