Share News

ఓకే చెప్తే తప్పేంటి..!

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:05 AM

శిక్షణలోని మహిళా ఐపీఎస్‌ అభ్యర్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి, జైలుకు వెళ్లిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని..

ఓకే చెప్తే తప్పేంటి..!

  • ఇన్‌స్టాలో మహిళలతో పరిచయాలపై ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): శిక్షణలోని మహిళా ఐపీఎస్‌ అభ్యర్థిపై లైంగిక వేధింపులకు పాల్పడి, జైలుకు వెళ్లిన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డికి చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని.. సోషల్‌ మీడియాలో వారితో చాటింగ్‌ చేయడంతోపాటు.. ప్రపోజ్‌ కూడా చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. ఉదయ్‌ కృష్ణారెడ్డి నుంచి ఒక ఫోన్‌తోపాటు, ల్యాప్‌టా్‌పను సీజ్‌ చేయగా.. అతని వద్ద మరొక ఐఫోన్‌ ఉన్నట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. మహిళా ట్రైనీ ఐపీఎ్‌సతో పాటు.. మరికొంత మంది మహిళల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారం ఆ ఫోన్లో ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘నేను సివిల్స్‌ సాధించిన తర్వాత పలు మీడియా ఛానల్స్‌లో, సోషల్‌ మీడియాలో స్ఫూర్తిదాయక కథనాలు చాలానే వచ్చాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో వేలమంది అభిమానులుగా మారారు. వారిలో కొంతమంది మహిళలు నాతో చాటింగ్‌, ప్రపోజ్‌ చేసేవారు. వారి ప్రపోజల్స్‌కు నేను ఓకే చెప్పాను. అందులో తప్పేముంది’’అని విచారణ సందర్భంగా ఉదయ్‌కృష్ణారెడ్డి చెప్పినట్టు తెలిసింది.

Updated Date - Aug 05 , 2026 | 06:06 AM