ప్యాడీక్లీనర్‌లో పడి మహిళా కూలీ దుర్మరణం
ABN , Publish Date - May 12 , 2026 | 04:35 AM
ఓ మహిళా కూలీ ప్యాడీ క్లీనర్ యంత్రంలో తలవెంట్రుకలు ఇరుక్కోవడంతో దుర్మరణంపాలైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశీగుడిశెలు గ్రామంలో...
చేర్యాల, మే 11 (ఆంధ్రజ్యోతి): ఓ మహిళా కూలీ ప్యాడీ క్లీనర్ యంత్రంలో తలవెంట్రుకలు ఇరుక్కోవడంతో దుర్మరణంపాలైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కాశీగుడిశెలు గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. గ్రామంలో కొద్దిరోజులక్రితం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో పలువురు మహిళలు కూలీపనులకు వెళుతున్నారు. అదేగ్రామానికి చెందిన ఇమామ్ బీ (55) సోమవారం కూలీ పనులకు వె ళ్లింది. ప్రభుత్వం సరఫరా చేసిన ప్యాడీక్లీనర్ సరిగా పనిచేయకపోవడంతో ప్రైవేటుకు చెందిన ఆటోమేటెడ్ ప్యాడీక్లీనర్‌ను అద్దెకు తీసుకున్నారు. ఈక్రమంలో ఆమె సోమవారం ఉదయం మిషన్ సాయంతో ధాన్యం తూర్పారబడుతుండగా కిందపడిన ధాన్యం ఎత్తేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆమె తలవెంట్రుకలు యంత్రంలో ఇరుక్కున్నాయి. దీంతో తలభాగం దెబ్బతిని అక్కడికక్కడే దుర్మరణం చెందింది.