Share News

హోలీ రోజు విషాదం

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:36 AM

హోలీ పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం నెలకొం ది. స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పదో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు.

హోలీ రోజు విషాదం

రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి దుర్మరణం

దేవరకొండ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): హోలీ పండుగ రోజు ఓ కుటుంబంలో విషాదం నెలకొం ది. స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పదో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కొండమ ల్లేపల్లిలో మంగళవారం జరిగింది. దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన సంజయ్‌ ఎస్‌ఎల్‌బీసీలో పని చేస్తూ 15ఏళ్లుగా దేవరకొండలో నివాసముంటున్నాడు. ఆయనకు కుమా రుడు కార్తీకేయ(16), కుమార్తె ఉన్నారు. మంగళవారం హోలీ పండగను పురస్క రించుకొని కొండమల్లేపల్లిలో ఉన్న మిత్రుడి కలిసేందుకు కార్తీకేయ అతని స్నేహితుడు శ్రీనివాసచారి ద్విచక్ర వాహనంపై కొండమల్లేపల్లికి వెళుతుండగా మార్గం మధ్యలో ఉప్పువాగు సమీపంలో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీకేయ, శ్రీనివాసచారిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్తీకేయ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. శ్రీనివాసచారి చికిత్స పొందుతున్నాడు.

Updated Date - Mar 04 , 2026 | 12:36 AM