kumaram bheem asifabad- ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 13 , 2026 | 10:10 PM
వాహనదారులు ట్రాఫిక్ నిబంధ నలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మోతుగూడ గ్రామంలో అవగాహన కల్పించారు.
ఆసిఫాబాద్ రూరల్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధ నలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మోతుగూడ గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. వాటికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడమేనని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పక వాడాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ, ఎస్సై ఉదయ్‌కిరణ్, సర్పంచ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జైనూర్ సీఐ రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని చెప్పారు. కారు, ఇతర వాహనాలు నడిపే వారు సీటుబెల్ట్ వినియోగించాలన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం ప్రమాదాలకు కారణమవుతాయన్నారు. వేగ నియంత్రణ పాటించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనం నడపకూడదన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, రాయిసెంటర్ సర్‌మెడి ఆత్రం ఆనంద్‌రావు, నాయకులు ఆంధ్రయ్య, ఆత్రంభీర్‌షా తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండలం గంగాపూర్ గారమంలో ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, వాటికి ప్రధాన కారణం నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడమేనని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్టు తప్పక వాడాలని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశంచారి, ఉప సర్పంచ్ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం లింగాపూర్ ఎస్సై గంగన్న ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్లు భద్రత నిబంధనలపై గ్రామస్థులకు అవగహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై గంగన్న మాట్లాడుతూ వేగం తోనే విలువైన ప్రాణాలను వాహనదారులు కోల్పోతున్నారని అన్నారు. వేగం కన్న ప్రాణం మిన్న అనే విషయాన్ని వాహనదారులు గుర్తించుకోవాలని చెప్పారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదాల్లో గాయపడితే ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ జాదవ్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు,
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం కోఠారి గ్రామంలో మంగళవారం సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్‌ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో మరణించిన మర్సుకోల మహేష్ కుటుంబానికి 25 కిలోల బియ్యంను అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్థులు, పోలీసులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల, చింతలమానేపల్లి మండల కేంద్రాల్లో మంగళవారం సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థుకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సైలు చంద్రశేఖర్, నరేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సురేష్ గ్రామస్థుకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.