Share News

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:15 PM

లక్షెట్టిపేట పట్టణంలోని ట్రినిటి హైస్కూల్లో రవాణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం విద్యా ర్థులకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ఎంవీఐ రంజిత్‌కుమార్‌

లక్షెట్టిపేట, జనవరి6 (ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట పట్టణంలోని ట్రినిటి హైస్కూల్లో రవాణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం విద్యా ర్థులకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎంవీఐ రంజి త్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే ట్రాఫిక్‌ రూల్స్‌పై అవ గాహన పెంచుకుంటే ఇంట్లో కుటుంబీకులను చైత న్యపరిచే అవకాశం ఉందన్నారు. రోడ్డు బద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రతీ పాఠశాలల్లో కళాశాలల్లో అవగాహన సదస్సులు పెట్టడంతో పాటు విద్యా ర్థులకు ట్రా ఫిక్‌ రూల్స్‌పై డ్రాయింగ్‌ కాంపిటేషన్‌, స్పీచ్‌ కాంపిటేషన్‌ నిర్వహిస్తు బహు మతులు అంద జేస్తున్నామన్నారు. అనంతరం పాఠశాల బస్సులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు. ఈకార్యక్రమంలో ఎంవీఐ కిషోర్‌ చంద్రారెడ్డి, పాఠశాల ప్రిన్సి పల్‌ జోసెఫ్‌, కరస్పాండెంట్‌ డోన్‌ డానెమిక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:15 PM