kumaram bheem asifabad- ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:20 PM
ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గురువారం జిల్లా ఎస్పీ నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా తొలి రోజు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ నియమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.
ఆసిఫాబాద్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో గురువారం జిల్లా ఎస్పీ నితికా పంత్, జిల్లా అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్‌లతో కలిసి రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా తొలి రోజు అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ట్రాఫిక్ నియమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, అధికారులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారి, ఉద్యోగి మోటారు వాహనాల చట్టంలో పొందు పరిచిన రహదారి నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. వాహనం నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపే వారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మనపై మన కుటుంబం ఆధార పడి ఉంటుందని, కుటుంబ సభ్యుల సంతోషం కోసం రహదారి ప్రయాణం సురక్షితంగా చేయాలని తెలిపారు. తోటి రహదారి వినియోగదారులను గౌరివించాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా అనుసరించాలని తెలిపారు. రహదారి భదరతా మాసోత్సవాలలో ప్రజలకు అవగాహన కల్పించి పాటించేలా చైతన్య పర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి శంకర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.