kumaram bheem asifabad- సంప్రదాయ సిరి దండారీ వేడుకలు
ABN , Publish Date - Nov 06 , 2026 | 10:24 PM
ఆదివాసీల సంప్రదాయ సిరి దండారీ వేడుకలు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని జామ్నిలో కొనసాగుతున్న గుస్సాడీ దండారీ వేడుకల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం పాల్గొని సందడి చేశారు. అంతకు ముందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలు, గుస్సాడీలతో కలిసి రేలా రేలా నృత్యం చేస్తూ సందడి చేశారు.
జైనూర్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సంప్రదాయ సిరి దండారీ వేడుకలు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. మండలంలోని జామ్నిలో కొనసాగుతున్న గుస్సాడీ దండారీ వేడుకల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం పాల్గొని సందడి చేశారు. అంతకు ముందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మహిళలు, గుస్సాడీలతో కలిసి రేలా రేలా నృత్యం చేస్తూ సందడి చేశారు. అంతకు ముందు ఏత్మాసూర్ దేతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏత్మాసూర్ దేవత గుస్సాడీలకు పాదాభినందనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలకు దండారీ, దీపావళి పండుగ ఎంతో ప్రాముఖ్యం అని చెప్పారు. సంప్రదాయబద్ధంగా ఆదివాసీలు ఏత్మాసూర్ దేవతను ఆరాధించడం ఆనవాయితీ అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్‌రావ్, సహకార చైర్మన్ కొడప హన్నుపటేల్, సర్పంచులు మడావి సొంబాయి, జాదవ్ శ్రావణ్ నాయక్, కుంర యశోద కేశవ్‌రావ్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు కుంర భగ్వంత్‌రావ్, ఉప సర్పంచ్ డోంగ్రే కళ్యాణి సమాధాన్, దండారీ నిర్వాహకులు మడావి యాదవ్ రావ్, భొజ్జు పటేల్, గ్రామ పటేల్ మడావి కొద్దు, మాజీ సర్పంచ్ మేస్రాం రాహుల్, పార్టీ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌లాలా, తొడసం ధర్మారావ్, జైనూర్, సిర్పూర్(యు) మండలాల బీఆర్‌ఎస్ నాయకులు ముండే సతీష్, తోడసం శ్రీనివాస్, చోలే మాధవ్, కెంద్రే భగవాన్, దాదారావ్, మడావి నాగోరావ్, గ్రామ పటేల్ మడావి కొద్దు, యాదవ్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలి
సిర్పూర్(యు), అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు తమ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని భావితరాలకు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. మండలంలోని సీతాగొంది, అమృత్‌రావుగూడ, నేట్నూర్, శేట్టిహాడ్పునూర్ తదితర గ్రామల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆదివాసీల ఆరాధ్య దైవాలైన ఎత్మసర్(దండారి) దేవతల పేరిట నిర్వహిస్తున్న దండారి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యదవ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, సర్పంచులు ఆత్రం ఓంప్రకాష్, మడావి లక్ష్మణ్, ఆత్రం విజయ లక్ష్మి, సహకార సంఘం చైర్మన్ కోడప హన్ను పటేల్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోడసం ధర్మరావు తదితరులు పాల్గొన్నారు.