Share News

హోలీ సంబరాల్లో జగ్గారెడ్డి జోష్‌

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:20 AM

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పాత బస్టాండ్‌ రాంమందిర్‌ వద్ద అట్టహాసంగా...

హోలీ సంబరాల్లో జగ్గారెడ్డి జోష్‌

  • సంగారెడ్డిలో బైక్‌పై తిరుగుతూ..డ్యాన్స్‌ చేస్తూ హోరెత్తించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

సంగారెడ్డి టౌన్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బుధవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పాత బస్టాండ్‌ రాంమందిర్‌ వద్ద అట్టహాసంగా జరిగిన హోలీ సంబరాల్లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి డ్యాన్స్‌ చేస్తూ హోరెత్తించారు. రాంమందిర్‌ కమాన్‌ వద్ద ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టడంతో పాటు డప్పు కొడుతూ సంబరాల్లో జోష్‌ నింపారు. డీజే పాటలతో డ్యాన్స్‌ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతకుముందు జగ్గారెడ్డి బైక్‌పై పట్టణంలోని ప్రధాన రహదారిపై తిరుగుతూ అక్కడక్కడ కార్యకర్తలు ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు.

Updated Date - Mar 05 , 2026 | 01:20 AM