Share News

‘మేమే అభ్యర్థులం’ అంటే చర్యలు తప్పవు

ABN , Publish Date - May 20 , 2026 | 04:01 AM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున తామే కార్పొరేట్‌ అభ్యర్థులమంటూ ముందస్తు ప్రచారాలు చేసుకుంటున్న నేతలపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ సీరియస్‌ అయింది.

‘మేమే అభ్యర్థులం’ అంటే చర్యలు తప్పవు

  • జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేతలకు టీపీసీసీ కమిటీ హెచ్చరిక

హైదరాబాద్‌, మే 19(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున తామే కార్పొరేట్‌ అభ్యర్థులమంటూ ముందస్తు ప్రచారాలు చేసుకుంటున్న నేతలపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ సీరియస్‌ అయింది. అధిష్ఠానం నుంచి ఎటువంటి ప్రకటన రాకముందే సొంతంగా ప్రకటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ చైర్మన్‌ మల్లు రవి హెచ్చరించారు. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికకు ఒక పద్ధతి ఉంటుందన్నారు. ముఖ్యంగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నట్లు కమిటీ దృష్టికి వచ్చిందని తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ సమావేశమైంది. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ అనధికారిక ప్రచారాలను ఆపకుంటే తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

Updated Date - May 20 , 2026 | 04:02 AM