Share News

ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:14 AM

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పార్టీ మహిళా నేతలపై మాజీ మంత్రి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ తీవ్ర అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ..

ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వండి

  • షబ్బీర్‌ అలీకి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ లేఖ

  • అదంతా అసత్య ప్రచారం.. ఎస్పీకి పలువురు నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌/కామారెడ్డి టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, పార్టీ మహిళా నేతలపై మాజీ మంత్రి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ తీవ్ర అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ.. లీక్‌ అయిన ఫోన్‌ సంభాషణ ఆడియోపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ (డీఏసీ) స్పందించింది. ఆ వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఆయనకు శనివారం లేఖను పంపింది. పార్టీ కార్యకర్తలతో షబ్బీర్‌ అలీ మాట్లాడిన ఫోన్‌ సంభాషణ ఆడియో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఫోన్‌ సంభాషణపై త్వరగా వివరణ ఇవ్వాలని షబ్బీర్‌ అలీని ఆదేశించింది. కాగా, షబ్బీర్‌అలీ పేరుతో సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని, సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజే్‌షచంద్రకు శనివారం వినతిపత్రం అందించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సందీప్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. షబ్బీర్‌ అలీపై ఉద్దేశపూర్వకంగా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 04:14 AM