Share News

గొల్లకురుమలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:16 AM

గొర్రెల పంపిణీ పేరుతో గొల్ల కురుమలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ అన్నారు. రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పి.

గొల్లకురుమలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది

  • టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌

గొర్రెల పంపిణీ పేరుతో గొల్ల కురుమలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌దని టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ అన్నారు. రెండో విడత గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పి.. గొల్లకురుమల నుంచి డబ్బులు వసూలు చేసి మొండి చెయ్యి చూపారని ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు గొల్ల కురుమలను పట్టించుకోకుండా, అధికారం పోయాక ఈ వర్గాల పట్ల హరీశ్‌రావు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గొల్ల కురుమలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని ఆయన అన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 05:16 AM