అరవింద్.. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడు..!: టీపీసీసీ
ABN , Publish Date - May 19 , 2026 | 05:39 AM
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడబోడని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు.
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడబోడని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఆయన తలపైన జుట్టు వస్తుందన్నది ఎంత నిజమో.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమూ అంతే నిజమన్నారు. అదృష్టం కొద్దీ రెండు సార్లు గెలిచిన అరవింద్.. వార్డు సభ్యుడికి కూడా పనికి రాడని ఎద్దేవా చేశారు. బీజేకి రాష్ట్రంలో ఉన్నది 8 మంది ఎమ్మెల్యేలైతే.. గ్రూపులు మాత్రం 16 ఉన్నాయన్నారు. కాగా, సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్‌లపై అహంకారపూరితంగా మాట్లాడినందుకు ధర్మపురి అరవింద్ క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయన రోడ్డుపైన తిరిగే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు.