ఆ ఆర్‌వోను ఉరి తీసినా తప్పులేదు
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:15 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర విషయాలపై కాకుండా మీనాక్షి నటరాజన్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని...
అధికారం లేకున్నా నామినేషన్ తిరస్కరించారు
ఎఫ్‌ఐఆరే లేనప్పుడు కేసు ఎక్కడిది?
మీనాక్షి విషయంపై కేటీఆర్ స్పందించాలి
బీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పి పాదయాత్రలు చేసుకోవాలి
8మీడియాతో చిట్‌చాట్‌లో మహేశ్ గౌడ్
హైదరాబాద్, జూన్ 13(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనవసర విషయాలపై కాకుండా మీనాక్షి నటరాజన్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని టీపీసీసీ చీఫ్ అన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం వల్లే గతంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని రాష్ర్టాలూ సమానమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘ఫోర్త్ సిటీ’ని అడ్డుకుంటామనడం బీఆర్‌ఎస్ నేతల మూర్ఖత్వమన్నారు. రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత కక్షతో మాట్లాడటం మానుకోవాలన్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు చేయాలనుకుంటే.. తాము అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం, భూ దోపిడీ, తెచ్చిన అప్పులపై ప్రజలకు వివరణ ఇచ్చి యాత్రలు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌లో టి.జీవన్‌రెడ్డిది ముగిసిన అధ్యాయమన్నారు. తాము అరాచకం చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిస్సిగ్గుగా ఒప్పుకొంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న 8మంది బీజేపీ ఎంపీలు ఘోరంగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
షబ్బీర్ అలా మాట్లాడటం సబబు కాదు
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలపై తాను తొందరపడి మాట్లాడాల్సిన అవసరం లేదని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. తన ఆస్తులు, వ్యక్తిత్వం ఏంటో నిజామాబాద్ ప్రజలకు బాగా తెలుసునన్నారు. చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీయే సీఎం సమక్షంలో పార్టీలో చేర్పించారని గుర్తుచేశారు. ఇన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదని, మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరమని పేర్కొన్నారు. ఏడాది క్రితం మాట్లాడిన ఆడియోను ఇప్పుడు బయటకు తీశారని, ఈ వ్యవహారంలో షబ్బీర్ అలీకి ఇప్పటికే పార్టీ తరఫున షోకాజ్ నోటీసు జారీ చేశామని తెలిపారు. లీకు వీరులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, అంతమాత్రాన ఇలాంటి కుట్రలకు పాల్పడరని స్పష్టం చేశారు.