ఆరోగ్య సేవల బలోపేతానికి టీపీసీసీ కమిటీలు
ABN , Publish Date - May 24 , 2026 | 04:55 AM
రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించే లక్ష్యంతో.. టీపీసీసీ డాక్టర్స్ సెల్- మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర కమిటీ...
డాక్టర్స్ సెల్ రాష్ట్ర కమిటీ, జిల్లా చైర్మన్లు, సలహాదారుల జాబితా విడుదల
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించే లక్ష్యంతో.. టీపీసీసీ డాక్టర్స్ సెల్- మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర కమిటీ, జిల్లా చైర్మన్లు, సలహాదారుల జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేశారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, వైద్య రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహే్‌షకుమార్ గౌడ్ మాట్లాడుతూ.. చదువుకున్న యువత భాగస్వామ్యం పెరగడం ద్వారా నాణ్యమైన రాజకీయాలకు పునాది పడుతుందన్నారు. టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ విభాగ కమిటీల నియామకాలు పార్టీ వ్యవహారం కాదని, రాష్ట్ర ఆరోగ్యరంగ భవిష్యత్తు కోసం తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పా రు. ఈ సందర్భంగా డా. రాజీవ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, అత్యవసర వైద్య సహాయ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్థం చేస్తున్నామని చెప్పారు.