Share News

kumaram bheem asifabad-మామిడి రైతుకు కష్టకాలం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:10 PM

ప్రతికూల వాతావరణం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా మామిడి రైతులకు ఈ ఏడాది కష్టకాలం ఎదురవుతోంది. పూత బాగానే వచ్చినా పిందె దశలో రాపోవడంతో దిగుబడి పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నాలుగైదేళ్ల నుంచి మామిడి సాగు చేస్తున్న రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ సారి పూత ఆశాజనకంగా రావడంతో ఆశలు రేకెత్తించినా ఇటీవల ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

kumaram bheem asifabad-మామిడి రైతుకు కష్టకాలం
: రెబ్బెనలోని మామిడి తోటలు

- ముంచిన తేనెమంచు తెగుళ్లు

రెబ్బెన, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రతికూల వాతావరణం, అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా మామిడి రైతులకు ఈ ఏడాది కష్టకాలం ఎదురవుతోంది. పూత బాగానే వచ్చినా పిందె దశలో రాపోవడంతో దిగుబడి పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో నాలుగైదేళ్ల నుంచి మామిడి సాగు చేస్తున్న రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ సారి పూత ఆశాజనకంగా రావడంతో ఆశలు రేకెత్తించినా ఇటీవల ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో చాలా వరకు పూత రాలి పోయింది. ప్రస్తుతం పిందె దశలో ఉన్నప్పటికీ మళ్లీ ప్రతికూల పరిస్థితి ఏర్పడనుందనే ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో 1260 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నట్లు ఉద్యాన శాఖాధికారులు చెబుతున్నారు. అత్యధికంగా రెబ్బెనలో 630 ఎకరాల్లో, కాగజ్‌నగర్‌లో 120 ఎకరాల్లో, సిర్పూర్‌(టి)లో 90 ఎకరాల్లో, దహెగాంలో 80 ఎకరాల్లో, చింతలమానేపల్లి, పెంచికలపేట, తిర్యాణి తదితర మండలాల్లో పదుల సంఖ్యల ఎకరాల్లో రైతులు పండిసేఉ్తన్నారు. గతేడాది పోల్చితే ఈ సారి 70 ఎకరాల వరకు విస్తీర్ణం పెరిగింది.

ఇక్కడ భిన్నంగానే..

ఉష్ణోగ్రతలు ఇతర జిల్లాలతో పోలిస్తే కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో భిన్నంగా ఉంటాయి. ఇదే మామిడి సాగును కలిసి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. మిగితా జిల్లాలో అక్టోబరు, నవంబరు నెలలో చెట్టుకు పూత రాగా ఇక్కడ మాత్రం ఒక నెల ఆలస్యంగా డిసెంబరులో వస్తుంది. వరుసగా నాలుగైదేళ్ల నుంచి నష్టాలను చూసిన జిల్లా రైతులు ఈ ఏడాది చెట్టుకు ఆకులు కూడా కనిపించని రీతిలో పూత పూయడంతో ఎకరానికి సుమారు 8 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేసుకున్నారు. కాగా ఉష్ణోగ్రతల మార్పుతో తేనెమందు పురుగు ఆశిస్తుండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఫంగస్‌ సోకి పూత రాలిపోగా పిందెలపై ప్రభావం చూపుతోంది. దాని నివారణకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తే పెట్టుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చెట్లపై పూతను చూసి రూ.లక్షల్లో లీజుకు తోటలను తీసుకోగా తీరా నష్టాలను భరించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

ప్రతి కూల పరిస్థితులు..

- ఎంఏ నదీమ్‌, జిల్లా ఉద్యాన శాఖాధికారి

మామిడి రైతులకు ప్రతి కూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో అకాల వర్షం కురవడం, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా రాత్రి చల్లగా ఉండడంతో వాతావరణం నిలకడగా ఉండదు. మామిడి చెట్లపై తేనెమంచు తెగుళ్ల ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పూత రాలి పోగా ప్రస్తుతం పిందె దశలో ఉంది. దీని నివారణ కోసం క్లోరిప్లైరిపాస్‌ ద్రావణాన్ని అలాగే ఫండిపైడ్‌ పౌడర్‌ను పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.

Updated Date - Mar 18 , 2026 | 11:10 PM