Share News

సిరిసిల్లలో కుమ్మరించిన వర్షం

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:38 AM

వర్షాకాలంలో కూడా ఉక్కపోత, ఎండవేడితో సతమతమవుతున్న జిల్లా ప్రజలకు కాస్త ఊరటనిస్తూ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కుమ్మరించింది. భారీగా కురిసిన వర్షానికి సిరిసిల్ల చేనేత చౌక్‌, వెంకంపేట, గణేష్‌నగర్‌

సిరిసిల్లలో కుమ్మరించిన వర్షం
సిరిసిల్ల చేనేత చౌక్‌ వద్ద నిలిచిన నీరు

సిరిసిల్ల, ఆగస్టు 17 (ఆంరఽధజ్యోతి): వర్షాకాలంలో కూడా ఉక్కపోత, ఎండవేడితో సతమతమవుతున్న జిల్లా ప్రజలకు కాస్త ఊరటనిస్తూ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కుమ్మరించింది. భారీగా కురిసిన వర్షానికి సిరిసిల్ల చేనేత చౌక్‌, వెంకంపేట, గణేష్‌నగర్‌, తారకరామానగర్‌, సుందరయ్యనగర్‌, బీవైనగర్‌, పద్మనగర్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. దీంతో సిరిసిల్లలో కొద్దిసేపు ప్రజలు ఇబ్బం దిపడ్డారు. జిల్లాలో అత్యధికంగా తంగళ్లపల్లిలో 51.3 మిల్లీమీ టర్లు, ముస్తాబాద్‌లో 47.0 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 45.5 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 36.8 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - Aug 18 , 2026 | 12:38 AM