Share News

కుండపోత వర్షం...

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:29 PM

జిల్లాలో మంగ ళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రజల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. బుధవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో 42.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడు ఏకదాటిగా గంటల తరబడి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి.

కుండపోత వర్షం...

-జిల్లాలో గరిష్టంగా 96 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

-వాగులు, వంకలు ఉప్పొంగడంతో రాకపోకలు బంద్‌

-సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

-ఎల్లంపల్లిలో పెరుగుతున్న నీటి మట్టం

మంచిర్యాల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగ ళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రజల రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. బుధవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో 42.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడు ఏకదాటిగా గంటల తరబడి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. భారీ వర్షం కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణాలు, గ్రామాల్లోని వీధులు వరద నీటి ప్రవాహంతో చెరువులను తలపించాయి.

జిల్లాలో నమోదైన వర్షపాతం....

జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 42 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా జైపూర్‌ మండలంలో గరిష్టంగా 96.0 మిల్లీమీటర్ల వర్షం పడింది. నస్పూర్‌లో 82.8, మందమర్రి మండలంలో 79.0, హాజీపూర్‌ మండ లంలో 57.8, పాత మంచిర్యాలలో 55.3, నెన్నెల మండలం లో 43.5, కాసిపేట మండలం కొండాపూర్‌లో 40.8, లక్షెట్టిపే ట మండలం శాంతాపూర్‌లో 39.0, బెల్లంపల్లి మండలంలో 36.3, జన్నారం మండలం తపాల్‌పూర్‌లో 34.5, భీమిని మండలంలో 34.0, కోటపల్లి మండలం దేవులవాడలో 33.0 మి.మీ వర్షపాతం నమోదైంది. కన్నెపల్లి మండలం జన్కా పూర్‌లో 32.5, తాండూరు మండలంలో 29.8, భీమారం మండలంలో 24.5, చెన్నూరు మండలంలో 22.0, దండేపల్లి మండలం వెల్గనూరు, లింగాపూర్‌లో 9.0 మి.మీ వర్షం కురిసింది.

ఓసీపీల్లో ఉత్పత్తికి ఆటంకం...

జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనులపై తీవ్ర ప్ర భావం చూపుతున్నాయి. భారీగా వర్షపు నీరు చేరడంతో గనుల్లో భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీం తో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులు పూర్తిగా నిలిచి పోయాయి. క్వారీల్లో నీరు నిలిచిపోవడంతో పనులు జరగడం లేదు. భారీ వాహనాలు బురదలో కూరుకుపోయే అవకాశం ఉండటంతో ఒడ్డుపై ని లిపి ఉంచారు. మూడు ఏరియాల్లోని ఇందారం, రామకృష్ణాపూర్‌, మంద మర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో ఒక్కరోజులో దాదాపు 32 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, సుమారు లక్షా 80వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీ వెలికితతకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తు న్నారు. గనుల్లో నీరు నిల్వ ఉండటంతో డంపర్లు, ఎక్సకవేటర్లు వంటి బారీ యంత్రాల నిర్వహణ కష్టంగా మారింది. ఫలితంగా బొగ్గు రవాణా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. వర్షాలు తగ్గిన తరువాత గనుల్లో నిల్వ నీటిని తొలగించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరమే పూర్తిస్థాయిలో కార్యకలా పాలు పున:రుద్దరించే అవకాశం ఉంటుంది.

ఎల్లంపల్లిలో పెరుగుతున్న నీటి మట్టం.....

ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా గుడిపేట స మీపంలోగల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 148 మీ టర్లు కాగా ప్రస్తుతం 144.22 మీటర్ల ఎత్తు వరకు నీటి మ ట్టం ఉంది. అలాగే ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీ లకు గాను సాయంత్రం 11.110 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి 75,328 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరు తుండటంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం హైద్రాబాద్‌లోని మెట్రోపాలిటన్‌ వాటర్‌ స్కీం కోసం 275 క్యూసెక్కులు, నందిమేడారంలోని నంది పంప్‌ పంప్‌ హౌజ్‌కు 12,600 క్యూసెక్కుల నీటిని అధికారు లు విడుదల చేస్తు న్నారు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి దాకా ఆశించిన మేర వా నలు కురవకపోవడంతో ప్రాజెక్టు నీరు పూర్తిగా అడుగంటి పోయింది. దీంతో సాగు అవసరాలకు నీటిని బంద్‌ చేయ గా, కేవలం తాగునీటి కోసం మాత్రమే విడుదల చేశారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో నీరు చేరుతుండటంతో జలకళ సంతరిం చుకుంటోంది.

===================

లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు...

వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్‌

నస్పూర్‌ : నస్పూర్‌లో డ్రైనేజీలు, ఒర్రెలు వరద నీటి ప్రవాహంతో పొంగిపొర్లాయి. నస్పూర్‌ చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా తొళ్లవాగుపై ఉన్న మట్టి రోడ్డుకు వరద ప్రవాహంతో బుంగ ఏర్పడింది. వెంటనే అధికారులు తాత్కలికంగా మరమ్మతులు చేశారు. నస్పూర్‌ కాలనీలోని సింగరేణి పలు క్వాటర్లలోకి వరద నీ రు వచ్చి చేరింది. తిరుమల టౌన్‌షిప్‌లో వరద నీరు రోడ్డు పైకి చేరింది. తీగల్‌ పహడ్‌ రాంనగర్‌ లోని ఒర్రె వరద నీ టితో ఉదృతంగా ప్రవహిస్తుంది. లోతట్టున ఉన్న పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు నానా ఇబ్బం దులు ఎదుర్కొ న్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధ వారం మేయర్‌ ధర్ని మధుకర్‌ పర్యటించి తక్షణ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని డివిజన్లలో అ త్యవరస పరిస్థితిలో ప్రజలకు వేగంగా సేవలు అందించ డానికి సిద్దంగా ఉండాలన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 11:29 PM