Share News

విద్యార్థుల నమోదులో అగ్రస్థాస్థానం

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:09 PM

విద్యా పరిపాలనలో రాష్ట్ర స్థాయిలోనే జిల్లా అగ్రస్థానంలో ని లిచి విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది.

విద్యార్థుల నమోదులో అగ్రస్థాస్థానం

విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపిక...

-విద్యా పరిపాలనలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు

-గతేడాదితో పోల్చితే పది శాతం అదనంగా విద్యార్థుల చేరిక

నేడు సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రధానం

మంచిర్యాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యా పరిపాలనలో రాష్ట్ర స్థాయిలోనే జిల్లా అగ్రస్థానంలో ని లిచి విశిష్ట ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదితో పోల్చితే అద నంగా పది శాతం విద్యార్థులను చేర్పించాలని రాష్ట్ర ప్ర భుత్వం లక్ష్యం నిర్దేశించింది. లక్ష్యంలో భాగంగా జిల్లా 96.33 శాతం విద్యార్థుల నమోదు పూర్తిచేసి, రాష్ట్ర స్థా యిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. విశిష్ట విజయా న్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను పురస్కారానికి ఎంపిక చేయగా, ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

సమష్టి కృషితోనే సాధ్యం...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు జిల్లా కలెక్టర్‌ మార్గదర్శకత్వం లో జిల్లా విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అ మలు చేయడం సత్ఫలితాలను ఇచ్చింది. ఇందులో భా గంగా జిల్లా విద్యాశాఖ అఽధికారి, అదనపు కలెక్టర్‌ చం ద్రయ్య నేతృత్వంలో వినూత్న విధానాల అవలంభన, పటిష్టమైన వ్యూహరచన, నిరంతర పర్యవేక్షణతో జిల్లా కు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం లభించినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. విద్యాశాఖ సెక్టోరల్‌ అధి కారులు, మండల విద్యాధికారులు, పాఠశాల సముదా య ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సాంకేతిక సిబ్బందికి స్పష్టమైన లక్ష్యాలు కేటాయించా రు. ఇలా సమష్టి కృషితో జిల్లాను రాష్ట్రస్థాయిలో విజ యం వరించింది.

పెరిగిన విద్యార్థుల సంఖ్య...

ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరా నికి సంబంధించి విద్యార్థుల సంఖ్య గతంతో పోల్చితే పెరిగింది. 2024-25 విద్యా సంవత్సరంలో 41,349 ఉన్న విద్యార్థుల సంఖ్య 2025-26లో 43,072కు పెరిగింది. అలాగే 2026-27లో 45,626 చేరుకోగా గతేడాదితో పో ల్చితే ఆరు శాతం వృద్ధి సాధించారు. ఈ విద్యా సంవ త్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల నుంచి ఏకంగా 4,336 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరడం గమనార్హం. దీంతో ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ పరిధిలో మొత్తం ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలు 484 ఉండగా, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 96, హై స్కూళ్లు 108, కస్తూర్భా గాంధీ బాలి కల విద్యాలయాలు 18, మోడల్‌ స్కూళ్లు 5, గుడిపే టలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ 1, బెల్లంపల్లిలో తె లంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ సొ సైటీ ఒకటి ఉంది. ఆయా పరిధిలో 45వేల పైచిలుకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై తల్లిదండ్రుల్లో క్రమంగా పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరు గైన వసతులు, పూర్తిస్థాయిలో టీచింగ్‌ స్టాఫ్‌ ఉండటం, ఉ దయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తదితర సౌ కర్యాల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు కొన్నేళ్లు గా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందు కు ఆసక్తి కనబరుస్తున్నారు. మందమర్రి, నస్పూర్‌, జై పూర్‌, హాజీపూర్‌, భీమారం మండలాల్లో గత విద్యా సంవత్సరంతో పోల్చితే అదనంగా పది శాతానికిపైగా విద్యార్థులు చేరడమే దీనికి నిదర్శనం. అలాగే జిల్లాలో ని మిగతా 11 మండలాల్లో ఈ ఏడు అదనంగా ఆరు శాతానికి మించి విద్యార్థుల నమోదు కావడం గమనార్హం.

ప్రజా ప్రతినిధుల సహకారంతో...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేం దుకు విద్యాశాఖ ప్రజా ప్రతినిధుల సహాయ, సహకా రాలు పొందింది. ఇందులో భాగంగా జిల్లాలోని 466 మంది వివిధ సర్పంచులు, మునిసిపల్‌ కార్పొరేటర్లు, మునిసిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లకు విద్యాశాఖ నిర్వ హిస్తున్న కార్యక్రమాలపై ఒకరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాల నుంచి పట్టణాల వ రకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య ల భిస్తుందన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జరిగింది. మరో వైపు జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్థాయిని ప్రారంభించడం కూ డా విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు దోహదపడింది. కే జీబీవీ, ఆదర్శ పాఠశాలలు, బాలికల వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పన కారణంగా మంజూరైన వి ద్యార్థుల సంఖ్య కంటే అదనంగా నమోదయ్యారు. ఐదవ తరగతి విద్యార్థులతో సమీపంలోని ఉన్నత పా ఠశాలల సందర్శన, ఆయా ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం లు విద్యార్థులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే స్వ యంగా చేర్పించడం వంటి ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ లక్ష్యానికి చేరువైంది.

ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు....

రాష్ట్రస్థాయి విద్యార్థుల నమోదులో జిల్లా విద్యాశాఖ ముందంజలో ఉండటంతో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను అవార్డుకు ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించు కొని కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వ హించే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్‌ పురస్కారాన్ని అందుకోనున్నారు. అ వార్డుకు ఎంపికైన కలెక్టర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు కలెక్టర్‌తోపాటు, సంబంధింత అధికారులు అభినందించారు.

ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాం....

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

ప్రభుత్వం విధించిన లక్ష్యం చేరేందుకు ప్రత్యేక ప్ర ణాళికలు అమలు చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలి క వసతులు పెంచడం కూడా లక్ష్యసాధనకు దోహద పడింది. అలాగే విద్యా సంవత్సరం ఆరంభం కాక ముందే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్ర ణాళిక రూపొందించాం. సహజంగా జూన్‌లో విద్యార్థు లను చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తుంటా రు. దానికి భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే వి ద్యార్థుల చేరికపై దృష్టిసారించాం. విద్యాశాఖ అధికారు లు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో లక్ష్యాన్ని సాధించడం ఆనందంగా ఉంది.

Updated Date - Sep 04 , 2026 | 11:09 PM