ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:54 AM
మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య తన బృందంతో కలిసి బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో ఆ రాష్ట్ర హోంమంత్రి విజయశర్మ ఎదుట లొంగిపోయారు.
మావోయిస్టు అగ్రనేత పాపారావు
10 లక్షల నగదు, 8 ఏకే 47 తుపాకుల స్వాధీనం
ఒడిశాలో మరో నేత సుక్రు లొంగుబాటు
చర్ల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య తన బృందంతో కలిసి బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పుర్‌లో ఆ రాష్ట్ర హోంమంత్రి విజయశర్మ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన 18 మంది బృందంలో ఏడుగురు మహిళలున్నారు. వారి నుంచి పోలీసులు 8 ఏకే 47 తుపాకులు, రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. బస్తర్‌లో మావోయిస్టు పార్టీ ఆఖరి ఊపిరి పీల్చుకుంటోందన్నారు. హింస ద్వారా మావోయిస్టులు సాధించేదేమీ లేదని, సమాజంలో మార్పులు తీసుకురావాలంటే జనజీవన స్రవంతిలోకి రావాలని అన్నారు. మార్చి 31 నాటికి మావోయిజం పూర్తిగా అంతమైపోతుందన్నారు. లొంగిపోయిన పాపారావు బృందానికి పోలీసులు రాజ్యాంగ ప్రతిని అందజేశారు. మరోవైపు ఒడిశాలోని కందమాల్ జిల్లాలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సుక్రు మరో నలుగురు బృంద సభ్యులతో కలిసి బుధవారం ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట లొంగిపోయారు. 30 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సుక్రు తలపై సుమారు రూ.55 లక్షల రివార్డు ఉంది. కొద్దిరోజుల క్రితం లొంగి పోతానన్నందుకు సహచరుడు అన్వే్‌షను హత్యచేసి అడవిలో పూడ్చిపెట్టిన ఘటనలో సుక్రు ప్రధాన నిందితుడు.