kumaram bheem asifabad- అంగన్‌వాడీలకు మరుగుదొడ్లు
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:11 PM
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పిల్లలను, అంగన్‌వాడీ కార్యకర్తలను వేధిస్తున్న మరుగుదొడ్ల సమస్య ఇక శాశ్వతంగా తీరనున్నది. మరుగుదొడ్లతో పాటు మౌలిక సదుపాయాలు సమకూరను న్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్వచ్ఛభారత్ మిషన్ మరుగుదొడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబరు 21న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
- ఒక్కోదానికి రూ.52వేల ఖర్చు
- 298 కేంద్రాల్లో సమకూరనున్న వసతులు
- పిల్లలకు తీరనున్న ఇబ్బందులు
బెజ్జూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పిల్లలను, అంగన్‌వాడీ కార్యకర్తలను వేధిస్తున్న మరుగుదొడ్ల సమస్య ఇక శాశ్వతంగా తీరనున్నది. మరుగుదొడ్లతో పాటు మౌలిక సదుపాయాలు సమకూరను న్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్వచ్ఛభారత్ మిషన్ మరుగుదొడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబరు 21న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో పిల్లలు, ఇందులో పనిచేసే అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల, మూత్ర విసర్జనకు పిల్లలు ఆరుబయటకు వెళ్తున్నారు. 0-6ఏళ్ల మధ్య వయసు కలిగిన చిన్నారులు ఉండే అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు అవసరమని ప్రభుత్వం భావించింది. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం లో గరిష్టంగా 20నుంచి 30పిల్లలతో పాటు ఒక అంగన్‌వాడీ కార్యకర్త, ఒక ఆయా ఉంటారు. పౌష్టికాహారం తీసుకు వెళ్లేందుకు అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలు వస్తుంటారు. ఏళ్లుగా మరుగుదొడ్లు లేకపోవడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు.
- సొంత భవనాలు ఉంటేనే..
జిల్లాలో సొంత భవనాలు ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మరుగుదొడ్లు నిర్మిస్తారు. జిల్లాలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలకే సొంత భవనాలు ఉన్నాయి. చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పాఠశాలల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి పని చేయడం లేదు. నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారుతు న్నాయి. పాత అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణంలో మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేయడంతో పాటు వాటిని నవీకరిం చేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు కొత్తగా నిర్మించే అంగన్‌వాడీ కేంద్రాల భవనాల్లో మరుగుదొడ్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తారు. పునరుద్దరించిన ఐసీడీఎస్ పథకంలో టాయిలెట్ నిర్మాణం ఒక ముఖ్యభాగం. నీటి సౌకర్యం కోసం పంచాయ తీరాజ్ డిపార్ట్‌మెంట్ సహకారం కూడా తీసుకుంటారు. మరుగుదొడ్ల నిర్మాణం వెనుక పిల్లల్లో పరిశుభ్రతను ప్రోత్సహించ డానికి, అంగన్‌వాడీలలో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీరు వంటివి ప్రోత్సహించాలన్నదే ప్రధాన లక్ష్యం.
- జిల్లాలో 973 కేంద్రాలు..
జిల్లాలో మొత్తం 973కేంద్రాలు ఉన్నాయి. ఇందు లో 317అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉ న్నాయి. 353కేంద్రాలు పాఠశాలల్లో కొనసాగుతున్నా యి. 303కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నా యి. జిల్లాలో 298కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మిం చేందుకు నిధులు మంజూరయ్యాయి. వీటికోసం రూ.15కోట్లకు పైగా నిధులు అవసరం ఉంటుంది. ఒక్కో కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.52 వేలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 70శాతం నిధులు రూ.36,400కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30శాతం నిధులు రూ.15వేలు వంతు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి కానున్నది.
- తీర్మానం తప్పనిసరి..
అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుడొడ్ల నిర్మాణానికి కొత్తగా కొలువుదీరిన గ్రామపంచాయతీ పాలకవర్గా లు సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయాలి. సంబంధిత పత్రాలతో ఎంపీడీవోకు దరఖాస్తు చేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీ లించి ప్రతిపాదనలు సంబంధిత జిల్లా గ్రామీణాభి వృద్ధిశా ఖ అధికారులకు పంపాలి. ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పరిశీలించి కలెక్టర్లకు పంపిస్తే మరుగు దొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. పనులను ప్రారం భించి ప్రతీ దశలో ఫొటోలు తీసి పంపాలి. ఎప్పటిక ప్పుడు ఎంపీడీవోలు పనులు తనిఖీ చేసి కలెక్టర్‌కు పంపితే నిధులు విడుదల చేస్తారు. పనుల నిర్వహణ బాధ్యతను అంగన్‌వాడీ కేంద్రం ఇన్‌చార్జీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
298 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపాం..
- అడెపు భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారి ఆసిఫాబాద్
జిల్లాలో 298క కేంద్రాలకు మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజే శాం. సొంత భవనాలున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగు దొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యా యి. ఒక్కో దానికి రూ.52వేలు కేటాయించారు. ఆయా గ్రామాల్లో నిర్మించేందుకు పాలకవర్గాల అనుమతితో తీర్మానం చేయాల్సి ఉంటుంది.