నేటి దీక్షా దీవస్‌ను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:40 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్ష న్ హాల్‌లో నేడు నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శనివా రం పరిశీలించారు.
- బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్ష న్ హాల్‌లో నేడు నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి శనివా రం పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే నాయ కులు, కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధ న కోసం కేసీఆర్ చేసిన త్యాగాన్ని, పోరాట స్ఫూ ర్తిని స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం నిర్వ హించే దీక్షాదీవస్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతిని ధులు, కార్యకర్తలు, యువకులు అధిక సం ఖ్యలో హాజరవ్వాలని ఆయన కోరా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నా యకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : తె లంగాణ దీక్షాదివస్ సందర్భంగా ఆది వారం ఉదయం 10:30 గంటలకు త హసీల్దార్ కార్యాలయ సమీపం లోని తెలంగాణతల్లి, అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమం నిర్వహించ నున్నట్లు మాజీ మునిసిపల్ చైర్మన్ ఎడ్మసత్యం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్ర తినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకా రులు ప్రజలు పాల్గొనాలని కోరారు.
ఫ కోడేరు, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్ర మైన కోడేరులో దీక్షా దివస్ కార్యక్రమం ఆదివా రం నిర్వహిస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సూర్య రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్.ఎస్. ప్ర వీణ్‌కుమార్, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హాజరవుతారన్నారు. విజయ వంతం చేయాలని ప్రజలను కోరారు.