kumaram bheem asifabad-ఒత్తిడి వీడేలా..నమ్మకం పెంచేలా..
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:18 PM
పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఆందోళన వీడి స్వేచ్ఛగా ఆలోచించి పరీక్షలు రాస్తేనే విజయం దాసోహం అవుతుంది. అన్ని తరగతుల విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తూ వారిలో కేరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రైమ్ నిమిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పాఠశాలల్లో ఎక్స్‌ఫర్డ్ టాక్ పేరిట పిల్లల్లో ఆత్మస్తైర్యం నింపెందుకు శ్రీకారం చుట్టిం ది.
వాంకిడి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఆందోళన వీడి స్వేచ్ఛగా ఆలోచించి పరీక్షలు రాస్తేనే విజయం దాసోహం అవుతుంది. అన్ని తరగతుల విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తూ వారిలో కేరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రైమ్ నిమిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పాఠశాలల్లో ఎక్స్‌ఫర్డ్ టాక్ పేరిట పిల్లల్లో ఆత్మస్తైర్యం నింపెందుకు శ్రీకారం చుట్టిం ది. వివిద రకాల ఓత్తిళ్లను అధిగమించి ఉత్తమ ఫలితాలు సాధన, భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు నిపుణులతో అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో ప్రేర ణ నింపుతున్నారు. జిల్లాలో మొత్తం 18 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి.
- భయం వీడాలని..
పరీక్షలు అంటే బయం వీడాలని, తమపై నమ్మకం పెంచుకోవాలని తల్లిదండ్రు లు కూడా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ప్రతి రోజు పునశ్చరణకు సమయం కేటాయిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు. విద్యార్థులు రోజువారీ చదువుకు సమయం పట్టిక రూపొందించు కోవాలని, చిన్న విరామాలతో చదవడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. పాఠ్యాశాలను కేవలం కంఠస్థం చేయడంకంటే అవగాహనతో చదవడం ముఖ్యమని పేర్కొంటున్నారు. మొబైల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండి తగినంత నిద్ర, సాత్వికాహారం, నియమిత వ్యాయామం ద్వారా శారీరక-మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల వాంకిడి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ఎలా పరీక్షలు రాయాలో మానసిక వ్యక్తిత్వ వికాస నపుణుడు సదానందం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులకు మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణుడు సుదిళ్ల రమేశ్. స్ఫూర్తిదాయక వ్యక్తుల విజయాలను వివరిస్తూ పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఎలా చదువుకోవాలి, ఎలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలో వివరిచారు. విద్యార్థులు ఉన్నత రంగాల్లో నిలవాలంటే ఏవిధంగా ముందుకు సాగాలి, ఏ సబ్జెక్టులపై పట్టు సాధిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయి అనే విషయాలను వివరించారు.
ఫ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా...
- గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడంవల్ల స్ఫూర్తి పొందుతారు.
- పరీక్షలంటే భయం పోగొట్టడం, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఎలా ఉండాలో నేర్చుకునే అవకాశం
- ప్రతీ వ్యక్తి గెలుపు, ఓటముల సమ్మేళనమని, ఓటమి చెందినా కుంగిపోకుండా ఉంటారు.
- సమయపాలన, సమయ నిర్వహణ విలువ తెలుసుకునే అవకాశం
- విద్యార్థులే తమను తాము పరిశీలించుకుని అంతర్‌పరిశీలన చేసుకుని మానసికంగా ధృడంగా అవుతారు.
- మాదక ద్రవ్యాల వినియోగం, విపరీత ధోరణులు లేకుండా ఉండాలి.