Discount on Electric Vehicle: విద్యుత్ వాహనాల కొనుగోలుపై 20శాతం రాయితీ పట్ల టీఎన్జీవో హర్షం
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:03 AM
కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వోద్యోగులకు 20 శాతం రాయితీ కల్పిస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల టీఎన్జీవో నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కొత్తగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వోద్యోగులకు 20 శాతం రాయితీ కల్పిస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల టీఎన్జీవో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రాయితీ వారిని విద్యుత్ వాహనాల కొనుగోలు వైపు మళ్లించేందుకు మరింతగా ప్రోత్సాహిస్తుందని, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదా, స్థిరమైన రవాణా విధానాల దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.