టిమ్స్ ఆస్పత్రిలో 184 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:59 AM
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు, టెక్నీషియన్లు సహా పలు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రిక్రూట్‌మెంట్ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించారు.
మెడికల్ ఫ్యాకల్టీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఖాళీలు
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు, టెక్నీషియన్లు సహా పలు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రిక్రూట్‌మెంట్ బాధ్యతలను నిమ్స్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో టిమ్స్‌లో మొత్తం 184 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నిమ్స్ మంగళవా రం మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు, 122 టెక్నికల్, అలైడ్ హెల్త్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు, 31 ఇతర సపోర్ట్, ఇంజనీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్ తదితర పోస్టులున్నాయి. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల్లో ప్రొఫెసర్లు-5, అసోసియేట్ ప్రొఫెసర్లు-2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు-24 ఉన్నాయి. వీటికి పోస్టును బట్టి 50 నుంచి 58 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయించారు. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల అభ్యర్థులకు జూలై 6న ఉదయం 9 గంటలకు నిమ్స్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ తదితర పోస్టులకు దరఖాస్తులను జూలై 6 సాయంత్రం 4 గంటలలోపు నిమ్స్‌లో సమర్పించాలి. అభ్యర్థుల సంఖ్యలను బట్టి ఇంటర్వ్యూ, రాతపరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.