Share News

kumaram bheem asifabad- ఈవీఎం గోదాం వద్ద పటిష్ఠ భద్రత చర్యలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:37 PM

ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్ర పరిచిన గోదాం వద్ద పటిష్ఠమైన భద్రత చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరిచిన గోదాంను నెలవారి తనిఖీలో భాగంగా గురువారం కలెక్టర్‌ సందర్శించారు. గేటుకు సీల్‌తో వేసిన తాళం, సీసీ కెమెరాలను పరిశీలించారు.

kumaram bheem asifabad- ఈవీఎం గోదాం వద్ద పటిష్ఠ భద్రత చర్యలు
ఈవీఎం గోదాంను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్ర పరిచిన గోదాం వద్ద పటిష్ఠమైన భద్రత చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరిచిన గోదాంను నెలవారి తనిఖీలో భాగంగా గురువారం కలెక్టర్‌ సందర్శించారు. గేటుకు సీల్‌తో వేసిన తాళం, సీసీ కెమెరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎం గోదాం వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు జమీల్‌, శ్యాంలాల్‌, ముసాఫీర్‌ హుస్సేన్‌లు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్‌ భవన సముదాయం ఆవరణలో గల ఉద్యానవనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టరేట్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకులకు ఆహ్లాద కరమైన వాతావరణం అందేలా నీడ నిచ్చే చెట్లు, అవసరమైన పూల మొక్కలను పెంచాలన్నారు. పిచ్చి మొక్కలను తొలగించి వాటి స్థానంలో నీడనిచ్చే చెట్లు, పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. భారీ వర్షాల వల్ల గుంతలు పడ్డ చోట మొరం వేసి చదును చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు.

విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తాం

ఆసిఫాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): వెదురుతో తయారు చేసి కళ్యాకృతుల కేంద్రానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించి కళాకృతులను తయారు చేసే వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని సాలెగూడలోని సీఎస్‌ఆర్‌ నిధులతో ఆర్‌ఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెదురుతో తయారు చేసే కళాకృతుల వర్క్‌షాప్‌ను గురువారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్క్‌ షాప్‌కు విద్యుత్‌ సౌక ర్యం కల్పించడంతో పాటు కళాకృతులను తయారు చేసే వారికి ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వెదురు కలపను మన జిల్లాలోని ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో సాగుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. ఈ సందర్భంగా శిక్షన పొందిన వారికి స్టై ఫండ్‌, కిట్స్‌, ట్రైనింగ్‌ సర్టిఫికేట్లు ఇవ్వలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకు రాగా చర్యలు తీసుకుంటమాన్నారు. ఈ కార్యక్రమంలో మేదరి సంఘం నాయకులు శ్రీనివాస్‌, మహేందర్‌, నర్సయ్య, రాజేష్‌, రాజశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 10:37 PM