Share News

kumaram bheem asifabad- మున్సిపల్‌ ఓట్ల లెక్కంపునకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:06 PM

రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు.

kumaram bheem asifabad- మున్సిపల్‌ ఓట్ల లెక్కంపునకు పకడ్బందీ ఏర్పాట్లు
గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒక హాల్‌లో ఐదు టేబుల్‌ల చొప్పున రెండు హాల్‌లలో 10 టేబుళ్లు ఏర్పాటు చేసి 20 వార్డులను రెండు రౌండర్లలో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ కౌంటింగ్‌ కేంద్రాన్ని కాగజ్‌నగర్‌ పట్టణంలోని డీఏవీ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, 30 వార్డులకు గాను రెండు రౌండ్లలో కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ సహయకులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్‌ ప్రక్రియ చేపడతున్నామని అన్నారు. కౌంటింగ్‌ విధులు నిర్వహించే సిబ్బంది తమకు కేటాయించిన కౌంటింగ్‌ కేంద్రాలకు ఉదయం 6.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి బందో బస్తు మధ్య నిర్వహిస్తామని తెలిపారు. ఆమె వెంట సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు

లింగాపూర్‌. ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండలంలోని జాములధరా గ్రామంలో గురువారం రెండో రోజు మధ్యాహ్నం వరకు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గ్రామానికి చేరుకుని పూర్తి విషయాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం కలెక్టర్‌ కె. హరిత హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. బోరు బావిని ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించారు. దింతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాములధరాలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులచేత సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ప్రజలకు రక్షిత నీటి సదుపాయం కల్పించేందుకు అధికారుల సమన్యయంతో ముందుకు సాగుతున్నా మని ప్రజలు అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో నిరంజన్‌, ఎఫ్‌ఆర్వో రమేశ్‌., ఎంపీడీవో రాంచందర్‌, తహసీల్దార్‌ నాగరాజు, సీఐ రమేష్‌, ఎస్సై గంగన్న, నాయకులు ఆత్రం అనీల్‌, రాహుల్‌,సునీల్‌, చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:06 PM