మునిసిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:09 PM
జిల్లాలోని నాగర్ క ర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ముని సిపాలిటీలలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని నాగర్ క ర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ముని సిపాలిటీలలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మునిసిపల్ ఎన్నికలకు త్వరలో షె డ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ రాణికుముదిని గురువారం క లెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ని ర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వ హించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడు ము నిసిపాలిటీల పరిధిలో 65వాటిలో ఎన్నికలు నిర్వహించేందుకు 131 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ దేవ సహాయం, మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.