Share News

kumaram bheem asifabad- పెద్ద పులులను సంరక్షించాలి

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:02 PM

అడవికి రాజైన పెద్దపులులను సంరక్షించాలని బెజ్జూరు అటవీశాఖ ఇన్‌చార్జీ రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. బుదవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా మండలంలోని సులుగుపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

kumaram bheem asifabad- పెద్ద పులులను సంరక్షించాలి
సులుగుపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న అటవీ అధికారులు, గ్రామస్తులు

బెజ్జూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): అడవికి రాజైన పెద్దపులులను సంరక్షించాలని బెజ్జూరు అటవీశాఖ ఇన్‌చార్జీ రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. బుదవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్బంగా మండలంలోని సులుగుపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అడవులతో పాటు వన్యప్రాణులను సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ ప్రాంతంలో పులుల ఆవాసం ఉండటం ఇక్కడి అటవీ ప్రాంతానికి ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. అనంతరం గ్రామంలో పులి దాడిలో మృతి చెందిన పశువుల యజమానులకు మొక్కలు అందజేసి నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సోయం చిన్నయ్య, సెక్షన్‌ అఽధికారులు సాఫియాబేగం, మనోహర్‌, బీట్‌ అధికారులు స్రవంతి, నవ్యరెడ్డి తదితరులు ఉన్నారు.

కాగజ్‌నగర్‌/పెంచికల్‌పేట, (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ పులుల దినోత్సవ వేడుకలు కాగజ్‌నగర్‌లో వినూత్నంగా నిర్వహించారు. గత రెండేళ్లలో పులులు, చిరుతపులుల దాడిలో మరణించిన పశువుల యాజమానుల ఇంటి ముందర వారి కుటుంబ సభ్యులతో కలిసి అటవీ శాఖ అధికారులు మామడి మొక్కలు నాటారు. చనిపోయిన పశువుల జ్ఙాపకాల ఆనవాళ్లను శాశ్వతం చేశారు. ఈ కార్యక్రమంలో పులుల పట్ల ఎలాంటి ద్వేశం లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేట్టినట్టు అధికారులు తెలిపారు. అలాగే పెంచికల్‌పేటలో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ రేంజర్‌ అస్మా మాట్లాడుతూ పులుల రక్షణతోనే అడవులకు మనుగడ ఉంటుదన్నారు. కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి)లో అంతర్జాతీయ పులుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌ మాట్లాడుతూ పులుల సంరక్షణతో అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి దుర్గం ప్రవీణ్‌, ఎఫ్‌ఎస్‌ఓ మోహన్‌, ఎఫ్‌బీఓలు, ఎంఈవో సదాశివుడు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు టైగర్‌ జోన్‌ సందర్భంగా వివిధ బహుమతులను అందజేశారు.

Updated Date - Jul 29 , 2026 | 11:02 PM