సిద్దిపేట నుంచి ఉత్తర దిశగా పులి కదలికలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:46 AM
తెలంగాణలో సంచరిస్తున్న పులిపై అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. పీసీసీఎఫ్ సువర్ణ అధ్యక్షతన అరణ్య భవన్‌లో ఉన్నతస్థాయి..
హైదరాబాద్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో సంచరిస్తున్న పులిపై అటవీ శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది. పీసీసీఎఫ్ సువర్ణ అధ్యక్షతన అరణ్య భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం అనంతరం, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ సమావేశమైంది. ఫిబ్రవరి 8 నాటికి పులి సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో ఉన్నట్లు అటవీ శాఖ బృందాలు గుర్తించాయి. పులి ఉత్తర దిశగా కదులుతున్నట్లు ట్రాకింగ్ ద్వారా తెలిసింది. దీంతో సిద్దిపేట, జనగాం, కరీంనగర్, యాదా ద్రి జిల్లాల్లో పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ, పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నా యి. శనిగరం, కోహెడ మండలాలు, ఆరేపల్లి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.