నేటి నుంచి పులుల గణన...
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:39 PM
దేశ వ్యా ప్తంగా పులుల గణనను అటవీశాఖ అత్యంత అధునా తన పద్దతిలో చేపడుతోంది. ఇందుకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ)-2026 దేశం నడుం భిగిం చగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సర్వే ప్రారంభ మైంది.
-ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహణ
-పులుల జాడ, వాటి పాద ముద్రల నమోదు
-ఉమ్మడి జిల్లా పరిధిలో ఆరు అటవీ డివిజన్లు
-ఏడు వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అడవులు
మంచిర్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యా ప్తంగా పులుల గణనను అటవీశాఖ అత్యంత అధునా తన పద్దతిలో చేపడుతోంది. ఇందుకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ)-2026 దేశం నడుం భిగిం చగా, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సర్వే ప్రారంభ మైంది. ఇక తెలంగాణలో ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు పులుల గణన జరుగనుంది. ఇందుకు అధు నాతన పద్దతులైన గ్రౌండ్ ట్రాకింగ్, ఉపగ్రహ సాంకే తికత, ఏఐలను మిళితం చేయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా జరుగనున్న సర్వేకు కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిం చను న్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ని ర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల డీఎఫ్‌వోల ప ర్యవేక్షణలో పులుల గణన చేపడుతుండగా, వలంటీ ర్లు, ప్రజలు, అటవీ సిబ్బందితో కలిసి ఏడు రోజుల పాటు ట్రాన్సెక్ట్ వాక్‌లు నిర్వహిస్తారు. ఇందులో భాగం గా అడవుల్లో నడక నిర్వహిస్తూ పులుల జాడలు, పాద ముద్రలు, మల విసర్జన చిహ్నాలు, నివాస నాణ్యత, త దితర వివరాలను సేకరిస్తారు. అలాగే అడవుల్లో అట వీశాఖ అమర్చిన కెమెరా ట్రాప్‌లను పరిశీలించడం ద్వారా పులుల సంఖ్యను అంచనా వేస్తారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఈ నెల 20న నడక ప్రారంభిం చి 22వ తేదీ వరకు ఆయా బృందాలు జంతువుల ఆ నవాళ్లను గుర్తిస్తాయి. ఈ సమయంలో శాఖాహార జం తువుల గణన చేపట్టనుండగా, ప్రతి రోజూ ఉదయం 6.30 నుంచి 8.30 గంటలు, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు గణన చేపడతారు. అలాగే 23 నుంచి 25వ తేదీ వరకు మాంసాహార జంతువుల గణన చేపడతారు. వీటిలో భాగంగా పులులు, చిరుత లు, ఎలుగుబంట్లు, అడవి దున్నలతోపాటు అడవి కు క్కలు, అడవి పిల్లుల కుటుంబాలను లెక్కించనున్నా రు. మాంసాహార జంతువుల గణనలో భాగంగా రోజుకు ఐదు కిలోమీటర్ల చొప్పున నడక నిర్వహిస్తారు. దీంతోపాటు ట్రెయిల్ వాక్‌లో భాగంగా చెట్లు, అటవీ విస్తీర్ణం, భూభాగం, నీటి వనరులను కూడా పరిశీలిస్తారు.
ఏడు వేల చదరపు కిలోమీటర్లలో అడవులు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మొత్తం ఆరు అటవీ డివిజన్లు ఉండగా, 7,101.30 చదరపు కిలోమీ టర్ల అడవులు విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ డివిజ న్‌లో 1898.05 చదరపు కిలోమీటర్లు, నిర్మల్ డివిజన్‌లో 1025.16, జన్నారం డివిజన్‌లో 643.74, మంచిర్యాల డివిజన్‌లో 1115.37, బెల్లంపల్లి డివిజన్‌లో 1524.39, కాగజ్‌నగర్ డివిజన్‌లో 893.29 కిలోమీటర్ల మేర అ డవులు విస్తరించి ఉన్నాయి. వీటిలో మంచిర్యాల జిల్లా లో మొత్తంగా లక్షా 76వేల హెక్టార్లలో అడవులు విస్త రించి ఉండగా, అటవీ అధికారులు వాటిని 195 బీట్లు గా విభజించి సంరక్షిస్తున్నారు. ఇందులో జిల్లాలోని ఒక్క ర్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే లక్షా 54 ఎకరాల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. ర్యాలీ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో లక్షెట్టిపేట, దేవాపూర్, బెల్లంపల్లి, తిర్యాణి, తాళ్లపేట, గుండాల రేంజ్‌లు ఉండగా, వాటి పరిధిలోనే పులుల సంచారం అధికంగా ఉంది.
ప్రతి నాలుగేళ్లకు ఒకసారి గణన...
దేశవ్యాప్తంగా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆ ఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో పులుల గణన ని ర్వహిస్తున్నారు. చివరి సారిగా దేశవ్యాప్తంగా 2022లో సర్వే నిర్వహించారు. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఈ నాలుగేళ్లలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగి నట్లు అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని తడో బా ప్రాంతం నుంచి పులులు తరుచుగా ఇక్కడకు వ స్తుండగా, ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో సం చ రించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వస్తున్న పులులు నాలుగేళ్ల కాలంలో పిల్లలను కనడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా పరిధిలో పులుల సంఖ్య 14కు చేరినట్లు సమాచా రం. వీటిలో 4 ఆడ పులులు కాగా మిగతావి మగ పు లులు. ఇవన్నీ ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ అటవీ ప్రాం తంలో సంచరిస్తుండటంతో గుర్తింపు కోసం ఊర్ల పేర్లు వచ్చేలా ఏ, కే సిరీస్‌తో అటవీ అధికారులు వాటికి నా మకరణం చేశారు. ఏ- సిరీస్‌తో ఏ-1,2 రెండు పులులు ఉండగా, కే-సిరీస్‌తో కే-1-6 నెంబర్లుగల పులులు ఉ న్నట్లు అప్పట్లోనే అధికారులు గుర్తించారు. వీటితో పాటు సిర్పూర్, గోండియా సిరీస్‌తో మరో 6 పులులు ఉన్నట్లు అధికారుల గణనలో తేలింది. అయితే ప్రస్తు తం వాటిలో ఎన్ని స్థానికంగా ఉన్నాయి...? ఎన్ని తిరిగి తడోపా ప్రాంతానికి వెళ్లాయో స్పష్టంగా తెలియడం లేదు. జన్నారం, లక్షెట్టిపేట రేంజ్ పరిధిలో ప్రస్తుతం రెండు పులులు సంచరిస్తున్నట్లు సమాచారం. అందు లో లక్షెట్టిపేటలో ఆడపులి ఉండగా, అది గత 20 నెల లుగా ఇక్కడే స్థిరపడ్డట్లు తెలిసింది. ప్రస్తుతం చేప డుతున్న గణన ద్వారా పులుల వాస్తవ సంఖ్య తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ సారి నిర్వహించే గణనలో భాగంగా చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కు క్కలు వంటి ఇతర జంతువులతోపాటు శాకాహార జం తువులైన జింకలు, తదితర వాటి లెక్కింపు కూడా చే పట్టనున్నారు. దాంతోపాటే వృక్ష సంపద, ఆహార స మృద్ధిని కూడా అంచనా వేయనుండగా, పులులు, ఇత ర వణ్య ప్రాణులపై మానవ ప్రభావం ఏ మేరకు ఉందో కూడా స్పష్టం కానుంది.
పులి ఆవాసానికి చర్యలు ఉంటాయా..?
దేశవ్యాప్తంగా పులుల గణన చేపడుతున్న ప్రభు త్వం వాటి ఆవాసానికి కూడా అనువైన విధంగా చర్య లు చేపట్టాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. త డోభా కారిడార్ నుంచి ఇక్కడికి వస్తున్న పులులు కొం తకాలంపాటు సంచరించి, ఆమోమైన ఆవాసం లేక తి రిగి వెళ్తున్నట్లు అటవీ అధికారులే భావిస్తున్నారు. ఇ టీవల వర్షాకాలంలో తడోభా నుంచి రెండు మగ పులులు రాగా, కొద్ది రోజులకే అవి తిరుగు పయనమ య్యాయి. అందులో ఒక పులి ఇందారం ప్రాంతంలో ప ర్యటించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ర్యాలీ రిజర్వ్ ఫారెస్టుతో ఇందారం ప్రాంతానికి బయో కారిడా ర్ లేని కారణంగా అది తెరిగి వెళ్లిపోయింది. ఈ ప్రాం తంలో పులుల సంచారం పెరిగినందున అటవీశాఖ అవసరమైన చోట్ల బయో కారిడార్లు ఏర్పాటు చేయ డం ద్వారా అవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందు కు చర్యలు చేపట్టాలనే విజ్ఞప్తులు జంతు ప్రేమికుల నుంచి ఉన్నాయి.