పంచె కట్టి.. హలం పట్టి...
ABN , Publish Date - Mar 19 , 2026 | 11:29 PM
మండల పరిధిలోని రాంరెడ్డి పల్లిలో ఇందిరమ్మ గృహాలను గురువారం ఎంపీ మల్లు రవి పరిశీలించారు.
- రాంరెడ్డిపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉగాది గుంటుక తోలిన
ఎంపీ మల్లు రవి
నాగర్‌కర్నూల్/ తెలకపల్లి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని రాంరెడ్డి పల్లిలో ఇందిరమ్మ గృహాలను గురువారం ఎంపీ మల్లు రవి పరిశీలించారు. గ్రామంలోని ఐదు గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్నామని అన్నారు. ఇదే క్రమంలో రామి రెడ్డిపల్లి సమీపంలో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఉగాది సందర్భంగా పంచెకట్టుతో వ్య వసాయ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, నాగర్‌కర్నూల్ మాజీ సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి కు టుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ మల్లు రవి భరోసానిచ్చారు. గురువారం నాగర్‌కర్నూల్ మండలం వనపట్ల గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శిం చారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మల్లు రవి మాట్లాడుతూ దాదాపు 30ఏళ్ల పాటు శ్రీని వాస్‌రెడ్డి వివిధ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీకి అం దించిన సేవలు మరువలేనివన్నారు. మీ కు టుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని అన్నారు. ఎంపీ వెంట మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు ఎండీ హబీబ్, మాదిరెడ్డి భగవంతురెడ్డి, వంకేశ్వరం నిరంజన్, తగిలి శ్రీనివాసులు, శ్రీనివాస్ బహుదూర్ ఉన్నారు.