Share News

గొంతు క్యాన్సర్‌తో స్వరం కోల్పోయిన వృద్ధుడు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:51 AM

గొంతు క్యాన్సర్‌ కారణంగా మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయి, శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్న 65 ఏళ్ల వృద్ధుడికి మాదాపుర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు.....

గొంతు క్యాన్సర్‌తో స్వరం కోల్పోయిన వృద్ధుడు

  • మళ్లీ మాట తెప్పించిన వైద్య నిపుణులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గొంతు క్యాన్సర్‌ కారణంగా మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయి, శ్వాస తీసుకోవడానికీ ఇబ్బంది పడుతున్న 65 ఏళ్ల వృద్ధుడికి మాదాపుర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి మళ్లీ మాటను ప్రసాదించారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన చంద్రయ్య ఏడాది నుంచి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పలుమార్లు చికిత్సలు తీసుకున్నా క్యాన్సర్‌ పూర్తిగా తగ్గకపోగా, అది లారింక్స్‌ (వాయిస్‌ బాక్స్‌) వరకు వ్యాపించింది. దీంతో మాట్లాడటం, ఆహారం మింగడం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు మాదాపుర్‌లోని మెడికవర్‌ ఆస్పత్రిని ఆశ్రయించారు. సీనియర్‌ ఈఎన్‌టీ హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌ డాక్టర్‌ అశోక్‌ పృథ్వీరాజ్‌, ఈఎన్‌టీ హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌ సర్జన్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి, చీఫ్‌ అనస్థీషియాలజిస్టు డాక్టర్‌ వేణుగోపాల్‌ నేతృత్వంలోని నిపుణుల బృందం రోగికి క్యాన్సర్‌ ప్రభావిత భాగాన్ని తొలగించి, వాయిస్‌ ప్రోస్థసి్‌సను అమర్చారు. ఈ పరికరంతో రోగి మళ్లీ మాట్లాడగలిగే స్థితికి వచ్చారని వైద్యులు తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 05:51 AM