Share News

విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:55 AM

విద్యుదాఘా తం మూడు కుటుంబాల్లో విషాదం నిం పింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మం డలం మేదరిపేటలోని హరిహర ట్రేడర్స్‌లో చందనగిరి....

విద్యుదాఘాతంతో ముగ్గురి మృతి

దండేపల్లి, పరిగి, మార్చి 9 (ఆంద్రజ్యోతి): విద్యుదాఘా తం మూడు కుటుంబాల్లో విషాదం నిం పింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మం డలం మేదరిపేటలోని హరిహర ట్రేడర్స్‌లో చందనగిరి నాగరాజు(35) వాహన డ్రైవర్‌గా, మదాపూర్‌కి చెందిన చల్ల లక్ష్మీనారాయణ (45) హమాలీగా పని చేస్తున్నారు. సోమవారం ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు యజమాని వారిన అక్కడున్న ఐరన్‌ స్టాండ్‌ను తన ఇంటికి చేర్చాలని కోరాడు. వారు దానిని బంకు నుంచి తరలిస్తుండగా 11కేవీ విద్యుత్‌ తీగలకు తగలడంతో మంటలు చెలరేగాయి. నాగరాజు, లక్ష్మీనారాయణ షాక్‌కు గురై శరీరాలు కాలిపోయి మృతి చెందారు. మరో ఘటనలో వికారాబాద్‌ జిల్లా పరిగి మున్సిపాలిటీ కిష్టమ్మగుడి తండాకు చెందిన కౌలు రైతు కె.మోహన్‌(44) సోమవారం పొలంలో విద్యుత్తు స్తంభం నుంచి మోటారు దగ్గరకు వెళ్లే వైరును సరిచేస్తుండగా షాక్‌ తగిలి మృతి చెందాడు.

Updated Date - Mar 10 , 2026 | 03:55 AM