కాలిన బూడిదలో పడి ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:31 AM
రహదారి వెంట పార బోసిన కాలిన బూడిదలో పడి ముగ్గురికి గాయాలయ్యాయి. సోమ వారం సూర్యాపేట జిల్లా హుజూర్‌న గర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఒకరి పరిస్థితి విషమం.. ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
హుజూర్‌నగర్‌లో చికిత్స పొందుతున్న విశాల్
హుజూర్‌నగర్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రహదారి వెంట పార బోసిన కాలిన బూడిదలో పడి ముగ్గురికి గాయాలయ్యాయి. సోమ వారం సూర్యాపేట జిల్లా హుజూర్‌న గర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులోని ఒక రైస్‌మిల్లు ఎదుట కాలిన బూడిదను పోశారు. ఎన్నెస్పీ క్యాంప్‌లో నివాసం ఉంటున్న కర్నె విశాల్(7) అటుగా వెళ్లి బూడిదలో పడ్డాడు. అక్కడే ఉన్న దుండిగల యాకయ్య (30), నాగయశ్వంత్‌లు(10) విశాల్‌ను కాపాడే ప్రయత్నంలో బూడిదలో పడి వేడి తీవ్రతకు గాయపడ్డారు. స్థానికులు ముగ్గురిని బయటకుతీసి హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న విశాల్‌ను, యాకయ్యలను హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, నాగయశ్వంత్ హుజూర్‌నగర్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. కాలిన బూడిదను రహదారి వెంట ఎవరు పారబోసి వెళ్లారనే అంశంపై ఆరా తీస్తున్నారు.