వేములవాడలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు నూతన కౌన్సిలర్లు
ABN , Publish Date - Feb 14 , 2026 | 03:47 AM
వేములవాడ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు మరో రెండు సీట్లు తక్కువగా ఉండటంతో ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది.
వేములవాడ/భగత్‌నగర్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వేములవాడ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు మరో రెండు సీట్లు తక్కువగా ఉండటంతో ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో 21వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్‌ఎస్ అభ్యర్థి నరాల శేఖర్, 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కుమ్మరి శిరీష, 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఐల శ్రీనివా్‌సలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి ముగ్గురికి కాంగ్రెస్ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.