కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
ABN , Publish Date - May 21 , 2026 | 03:35 AM
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో విషాదకర ఘటన జరిగింది. గ్రామంలోని శివగంగ ఆలయంలోని కోనేరులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు.
2 కుటుంబాల్లో విషాదం.. జగిత్యాల జిల్లాలో ఘటన
మేడిపల్లి, మే 20: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో విషాదకర ఘటన జరిగింది. గ్రామంలోని శివగంగ ఆలయంలోని కోనేరులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. అడ్లగట్ట శేఖర్-భార్గవి, జగిత్యాలకు చెందిన ద్యావనపెల్లి భూషన్- భారతి దంపతులు బంధువులతో కలిసి శివగంగ ఆలయం వద్ద తెప్పతీయడానికి వెళ్లారు. కాసేపటికే పిల్లలు కనిపించకపోవడంతో కోనేరు వద్ద వెతికారు. అన్నాచెల్లెళ్ల్లయిన అన్విత సాయి (13), మనస్విని(11), వారి బంధువు శర్వాంద్(7) ఆడుకుంటూ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.