Share News

కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి

ABN , Publish Date - May 21 , 2026 | 01:57 AM

దేవునికి మొక్కులు అప్పజెప్పుకునేందుకు వెళ్లిన రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో గ్రామంలోని శివగంగ ఆలయం వద్దకు మొక్కులు అప్పజెప్పుకునేందుకు గ్రామానికి చెందిన అడ్లగట్ట శేఖర్‌- భార్గవి దంపతులు, వీరి తోడళ్లుడు జగిత్యాలకు

 కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి
అన్నా చెల్లెలు అన్విత సాయి- మనస్విని, శర్వాంద్‌ (ఫైల్‌)

మేడిపల్లి, మే 20: దేవునికి మొక్కులు అప్పజెప్పుకునేందుకు వెళ్లిన రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్‌లో గ్రామంలోని శివగంగ ఆలయం వద్దకు మొక్కులు అప్పజెప్పుకునేందుకు గ్రామానికి చెందిన అడ్లగట్ట శేఖర్‌- భార్గవి దంపతులు, వీరి తోడళ్లుడు జగిత్యాలకు చెందిన ద్యావనపెల్లి భూషన్‌- భారతి దంపతులు బుధవారం బంధు మిత్రులు, కుటుంబీకులతో కలసి గ్రామంలోని శివగంగ ఆలయం వద్ద తెప్పతీయడానికి వెళ్లారు. ప్రతి బుధవారం అక్కడికి మొక్కులు అప్పజెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తుండగా పిల్లలు కనిపించలేదు. ముందే పూర్తి చేసుకున్న అడ్లగట్ట శేఖర్‌- భార్గవి దంపతుల కుమారుడు శర్వాంద్‌ (7), అతని తోడళ్లుడైన జగిత్యాలకు చెందిన ద్యావనపెల్లి భూషన్‌- భారతి దంపతుల పిల్లలు అన్విత సాయి (13), మనస్విని(11)లు ఆడుకుంటూ కోనేరు వద్దకు వెళ్లారు. ఆందోళన చెందిన కుటుంబీకులు చుట్టూ వెతకగా ఆలయ కోనేరులో ఒకరు పైకి తేలుతూ కనిపించారు. అక్కడికి వెళ్లి కోనేరులో వెతకగా మరో ఇద్దరు దొరికారు. వెంటనే వారిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను కోరుట్ల సీఐ లక్ష్మినారాయణ, ఎస్సై శ్రీధర్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - May 21 , 2026 | 01:57 AM