సమస్యలపై పోరాడే వారిని ఆదరించాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:17 AM
అనునిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రజా సమ స్యల పరిష్కారానికి పోరాడే వారిని మునిసిపల్ ఎన్నికల్లో ఆదరించాలని సీపీఎం జిల్లా కార్యద ర్శి ఎండీ. జహంగీర్ అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్
మోత్కూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అనునిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రజా సమ స్యల పరిష్కారానికి పోరాడే వారిని మునిసిపల్ ఎన్నికల్లో ఆదరించాలని సీపీఎం జిల్లా కార్యద ర్శి ఎండీ. జహంగీర్ అన్నారు. మోత్కూరులో మంగళవారం జరిగిన సీపీఎం ముఖ్య కార్యకర్త ల సమావేశంలో మాట్లాడారు. మోత్కూరు మునిసిపాలిటీలో తమ పార్టీ పోటీ చేస్తుం దన్నారు. ప్రజా సేవ చేయాల్సిన రాజకీయాలు నేడు వ్యాపారంగా మారాయన్నారు. ఎన్నికల్లో డబ్బు రాజకీయా లను ప్రజలు తిరస్కరించాలన్నారు. స్థానిక మునిసిపాలిటీలో నెలకొన్న ప్రజా సమస్యలపై పోరాడిన వారిని ఆదరించాల న్నారు. కూరెల్ల నర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాటూరి బాలరాజు, నాయకులు బొల్లు యాదగిరి, గుండు వెంకటనర్సు, రాచకొండ రాములమ్మ, వనం శాంతికుమార్, పైళ్ల యాదిరెడ్డి, సురేందర్, కూరపాటి రాములమ్మ, కుర్మేటి యాదయ్య పాల్గొన్నారు.